డ్రోన్‌లో తుపాకులు పెట్టి ఎల్‌వోసీ దాటించిన పాక్.. కూల్చేసిన భారత్…


ఓ వైపు లద్దాఖ్ సరిహద్దులో చైనా చెలరేగి పోతుంటే.. మరోవైపు ఎల్‌వోసీ వెంబడి కవ్వింపులకు పాల్పడుతోంది పాకిస్తాన్. గూడఛర్య డ్రోన్‌లో ఆయుధాలను పంపి ఎల్‌వోసీ దాటిస్తోంది. శనివారం తెల్లవారుజామున భారత గగన తలంలోకి వచ్చిన పాక్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. కథువాలోని పన్సార్ ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్ డ్రోన్ కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన బోర్డర్ సెక్యూరిటీ విభాగం.. దాడి చేసి దాన్ని కూల్చేసింది. భారత భూభాగంలో డ్రోన్ పడిపోయింది. పాకిస్తాన్ స్పై డ్రోన్‌ను స్వాధీనం చేసుకొని.. తనిఖీ చేయగా అందులో ఆయుధాల బయటపడ్డాయి. ఐతే డ్రోన్‌లో ఆయుధాలను పెట్టి భారత్ వైపు డ్రోన్‌ను ఎందుకు పంపించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…

డ్రోన్లలో ఆయుధాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలను కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులకు అందించేందుకు పంపించారా? లేదంటే పాకిస్తాన్ భూభాగంలో కూర్చొనే తుపాకులను ఆపరేట్ చేసి.. భారత ఆర్మీ, బీఎస్ఎఫ్ పోస్టులపై దాడికి కుట్ర చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై భారత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌వోసీ వెంబడి డ్రోన్ కదలికల నేపథ్యంలో సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేసింది భారత సైన్యం.

About The Author