వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి….


చైనా దొంగదెబ్బ కొట్టిన తరుణంలో మన సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో భారత వాయుసేన రంగంలోకి దిగింది.

అధునాతన యుద్ధవిమానాలు, పోరాట హెలికాప్టర్లు సరిహద్దు ప్రాంతంలో గస్తీ కాస్తున్నాయి.

అటు చైనా కూడా సైనికులను, యుద్ధవిమానాలను మోహరిస్తోంది.

ఆదేశాలు వచ్చిన మరుక్షణం రంగంలోకి దిగేలా వాటిని సన్నద్ధం చేసుకుంటున్నాయి.

తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా బలగాల మధ్య భీకర ఘర్షణ జరిగిన గల్వాన్‌ లోయ వద్ద పరిస్థితి గుంభనంగా ఉంది.

‘డ్రాగన్’’ దొంగదెబ్బ నేపథ్యంలో మన సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి.

చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్దకు భారీగా బలగాలను పంపుతున్నాయి. భారత వాయుసేన కూడా రంగంలోకి దిగింది.

పోరాట సన్నద్ధతలో భాగంగా అదనంగా అధునాతన యుద్ధవిమానాలు, పోరాట హెలికాప్టర్లను పంపింది.

ఈ లోహ విహంగాలు ఇప్పటికే గగనతలంలో ఉద్ధృతంగా గస్తీ తిరుగుతున్నాయి.

వీటి గర్జనలు, సైనికుల మోహరింపులతో ఈ పర్వత ప్రాంతం మారుమోగుతోంది.

తన అమ్ములపొదిలోని కీలకమైన సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000, జాగ్వార్‌ యుద్ధవిమానాలను భారత వాయుసేన గత మూడు రోజుల్లో శ్రీనగర్‌, అవంతిపొర, లేహ్‌ ప్రాంతాలకు పంపింది. ఆదేశాలు వచ్చిన మరుక్షణం రంగంలోకి దిగేలా వాటిని సన్నద్ధం చేసింది.

ఇటీవలే అమెరికా నుంచి సమకూర్చుకున్న అధునాతన అపాచీ హెలికాప్టర్లనూ భారత్‌ మోహరించింది. సిక్కిం, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌కూ మరిన్ని యుద్ధ విమానాలను తరలించింది

About The Author