వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు ఇంటికి కేసీఆర్…


వీర జవాన్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సోమవారం సూర్యపేటకు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్

-మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి

భారత-చైనా సరిహద్దుల్లో వీరమరణం చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ పరామర్శ నిమిత్తం సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యపేట కు రానున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

శనివారం సాయంత్రం జగదీష్ రెడ్డి ,సునీత దంపతులు కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సందర్శించారు.

ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వివరాలను మంత్రి జగదీష్ రెడ్డి సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు వివరించారు.

కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు .

ప్రభుత్వం తరపున ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు గ్రూప్-1ఉద్యోగం కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

సంతోష్ బాబు సేవలకు గుర్తుగా యువతకు స్ఫూర్తిగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.

వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.

భవిష్యత్ లో కుటుంబ అవసరాల రీత్యా ఐదు కోట్ల నగదు ఇంటి జాగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.

అయితే ఇంటి జాగా అన్నది సూర్యపేట లేదా హైదరాబాద్ లోనా అన్నది కుటుంబ సభ్యుల ఇష్టానుసారంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు.

అందులో బాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్న సాయంపై కుటుంబ సభ్యులతో చర్చించినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని వారు స్వాగతించారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు

కల్నల్ సంతోష్ బాబు కుటుంబం తో సహా దేశంలోని మిగితా ప్రాంతంలోనీ ఇతర సైనికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆయన గొప్ప మనసుకు అద్దం పడుతోందన్నారు.

తనయుడు తిరిగి రాని లోకాలకు చేరిన బాధలో సైతం దేశం కోసం సంతోష్ బాబు ప్రాణాలు అర్పించారని చెప్పడం లో కల్నల్ సంతోష్ బాబు తల్లి దండ్రుల గొప్పతనానికి నిదర్శనమన్నారు.

About The Author