పోలీస్ సిబ్బందికి కూల్ క్యాప్స్

చిత్తూరు జిల్లా:తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ సిబ్బంది విసిబుల్ పోలీసింగ్ తో పాటు స్మార్ట్ పోలీసింగ్ గా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు  అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి సుప్రజ మేడం గారు పోలీస్ సిబ్బందికి కూల్ క్యాప్స్ ను అందించడం జరిగింది. అంతే కాకుండా విపరీతమైన ఎండ వేడిమి దృష్ట్యా సిబ్బంది ఒక పక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధులు, మరో ప్రక్క నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ఎండ వేడిమి వలన ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన జిల్లా యస్.పి గారు ప్రత్యేకంగా కూల్ క్యాప్స్ లను తయారు చేయించి  నిన్న  జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది అందరికి ఇవ్వడం జరిగింది. సిబ్బంది చాలా ఉపయోకరంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసారు.

About The Author