16 రోజుల క్రితం జన్మించిన ఆడ శిశువు దారుణ హత్య

రాజమండ్రి: సీతానగరం మండలం చిన్నకొండేపుడిలో దారుణం చోటు చేసుకుంది.16 రోజుల క్రితం జన్మించిన ఆడ శిశువు దారుణ హత్యకు గురైంది. శిశువు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 18న ఆడ శిశువును హత్య చేసి మృతదేహాన్ని ఇంటి సమీపంలోని బావిలో శిశువు తల్లి, అమ్మమ్మ, మునిఅమ్మమ్మ పడేసినట్లు పోలీసులు తెలిపారు. 19న శిశువు అపహరణకు గురైందంటూ నిందితులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆడ పిల్ల ఆర్థికంగా భారమన్న భావంతో శిశువును కుటుంబ సభ్యులు హత్య చేశారని పోలీసులు చెప్పారు. నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు.

About The Author