రోజాకి “హోం మంత్రి” పదవి…
అదృష్టం పండితే ఆరునూరవుతాయి. ఈ సామెత నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో కరెక్టుగా కుదిరింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో కీలక మార్పులు చేయబోతునట్టు ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజాకి ఊహించని పదవి దక్కబోతునట్టు తెలుస్తుంది. అసలు రోజాకి దక్కబోతున్న ఆ పదవి ఏంటి..? అంత అదృష్టం ఆమెకి పట్టడానికి కారణం ఏంటి..? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి రోజా గెలిచిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ కాస్ట్ ఈక్వేషన్స్ కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆమెకు మంత్రి పదవితో సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టాడు సీఎం జగన్. కానీ, మంత్రి పదవి చేపట్టాలన్న ఆమె కోరిక మాత్రం కలగానే మిగిలిపోయింది. అయినా రోజా మంత్రం ఎక్కడా తగ్గలేదు.. అటు నియోజకవర్గంలో, ఇటు రాష్ట్రంలో తన ఉనికిని చాటుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలపై నిప్పులుచేరుగుతూ.. లేడి ఫైర్ బ్రాండ్ అనే తన బిరుదును కాపాడుకుంటూనే వచ్చారు. అయితే ఇప్పుడు ఆ బ్రాండే రోజా పాలిట వరమైనట్టు తెలుస్తుంది. ఆ బ్రాండ్ కారణంగానే రోజాకి ఇప్పుడు హోంశాఖ మంత్రి పదవి దక్కబోతున్నట్టు సమాచారం. తాజాగా జగన్ మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్ళిపోవడంతో.. ఆ ఇద్దరి స్థానంలో ఎవరెవరికి అవకాశం దొరుకుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. అలాగే జగన్ తన మంత్రివర్గంలో మార్పులు కూడా చేయబోతున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రోజాను తన మంత్రివర్గంలోకి తీసుకొని ఆమెకు, ఎంతో కీలకమైన హోంశాఖ మంత్రి పదవి కట్టబెట్టాలని జగన్ భావిస్తున్నారట. దీనికి కారణం ప్రస్తుత హోం మంత్రి మేకతోటి సుచరిత జగన్ అనుకున్నంత ఆక్టివ్ గా లేకపోవడమే అని తెలుస్తుంది. అలాగే హోం మంత్రి ఆద్వర్యంలో ఉండే పోలీస్ వ్యవస్థపై కూడా అనేక ఆరోపణలు రావడం. పైగా ఆమె పనితీరుపై ప్రతిపక్షాలు నెరుగానే విమర్శలు చేస్తున్నారు. విశాఖ గ్యాస్ లీక్ సమయంలో కూడా ఆమె ఎక్కడా కనపడలేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న సీఎం జగన్.. ఆ పదవికి ఫైర్ బ్రాండ్ రోజా అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. రోజా అయితే ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలరని జగన్ నమ్మకం. ఈ నేపధ్యంలోనే రోజాకి హోంశాఖ మంత్రి పదవి ఇవబోతున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అలాగే మేకతోటి సుచరితకు వేరే ఏదైనా కీలక పదవి ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారాట. దీంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే రోజా కల నెరవేరబోతునట్టు తెలుస్తుంది. ఒకవేల ఇదే జరిగి.. అంత కీలక బాధ్యతలు రోజాకి అప్పగిస్తే ఆమె వాటిని ఎలా నెరవేరుస్తారు. నిత్యం ప్రతిపక్షం మీద విరుచుకుపడే ఈ ఫైర్ బ్రాండ్ మంత్రిగా వారిని ఎలా డీల్ చేస్తారో వేచి చూద్దాం.