పరువుహత్య: తమిళనాడులో మరో మారుతీరావు- మరణ శిక్ష విధించిన హైకోర్టు …
ఇంజినీరింగ్ చదువుతున్న దళిత విద్యార్థి అగ్రకులానికి చెందిన యువతిని పెళ్లాడాడని నాలుగు సంవత్సరాల తర్వాత అతణ్ని హత్య చేశారు. హంతకుడు యువతి తండ్రే కావడం గమనార్హం. కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు నిందితునికి ఉరిశిక్ష వేయాలని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత దానిని సవరించి అందులో ఐదుగురికి మాత్రం జీవిత ఖైదు విధించింది. 2017 డిసెంబరులో యువతి తండ్రితో పాటు మొత్తం ఆరుగురికి మరణ శిక్ష విధించింది లోయర్ కోర్టు. వీ శంకర్ అనే వ్యక్తిని మార్చి 2016న తమిళనాడులోని తిరుప్పూర్ లో పట్టపగలు మార్కెట్ ప్రాంతంలో మర్డర్ చేశారు. ఆ సమయంలో 19ఏళ్ల వయస్సున్న శంకర్ భార్య కౌసల్యపై కూడా బైక్ పై వచ్చిన వ్యక్తి దాడి చేశాడు. కౌసల్య తండ్రి చిన్నస్వామి హత్యకు పురమాయించినట్లు తెలిసింది. ఘటన మొత్తం లోకల్ సీసీటీవీ కెమెరాల్లో చూసి దేశమంతా షాక్ అయింది. మద్రాస్ హైకోర్టు ఎటువంటి కుదింపులు లేకుండా ఐదుగురికి కనీసం 25ఏళ్ల పాటు జీవిత ఖైదు అనుభవించాలని శిక్ష విధించింది. లోవర్ కోర్టు కౌసల్య తల్లి, మామయ్య, కాలేజీ విద్యార్థి సాక్ష్యంతో తీర్పు ఇచ్చింది. హైకోర్టు మాత్రం కౌసల్య తల్లితో పాటు మరో ఇద్దరిని విచారించి తీర్పు ప్రకటించింది. యువతి కుటుంబం స్థానికంగా రాజకీయంగా బలంగా ఉన్న తేవర్ కులానికి చెందినది. షెడ్యూల్ క్యాస్ట్ కు చెందిన శంకర్ అనే వ్యక్తిని పెళ్లాడినందుకు అయిష్టంగా ఉంది. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్తి, కౌసల్యను పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలల తర్వాత ఈ దాడి జరిగింది. మార్కెట్ లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. శంకర్, కౌసల్య నడుచుకుంటూ వస్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వచ్చి వారి వెనుక ఆగారు. పదునైన ఆయుధాలతో ఒక్కసారిగా దాడికి దిగారు. శంకర్ కదలడం ఆగిపోగానే కౌసల్యను కొట్టారు. అపస్మారక స్థితికి చేరుకోగానే బైక్ మీద పారిపోయాడు. ఎవరూ గుర్తు పట్టలేదనే ధీమాతో కనిపించారు. చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లిన శంకర్ ఎక్కువ రక్తం పోవడంతో చనిపోయాడు. కౌసల్య రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. వృత్తి రీత్యా వ్యవసాయ కుటుంబమైన శంకర్ ఫ్యామిలీతోనే కౌసల్య ఉంటూ డిసెంబరు 2018లో రెండో వివాహం చేసుకుంది.