భారత రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..

భారత రైల్వే శాఖ నిబంధనలను మార్చింది.బుక్ చేసిన రైలు టికెట్‌ మొత్తాన్నితిరిగిపొందడానికి నిబంధనలను మార్చింది. ఏప్రిల్ 14 … అంతకుముందు బుక్ చేసుకున్న అన్ని సాధారణ రైలు టిక్కెట్లను తిరిగి చెల్లించాలని భారత రైల్వే నిర్ణయించింది. 2020 ఏప్రిల్ 12న లేదా రాబోయే 120 రోజులకు రైల్వే టికెట్లను బుక్ చేసుకుంటే.. ఆ రైలు రద్దు చేస్తే, పూర్తి మొత్తాన్ని ఐఆర్సీటీసీ తిరిగి చెల్లిస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు, ఇతరులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఐఆర్‌సీటీసీ 230 స్పెషల్ రైళ్లను నడుపుతోంది. కొవిడ్ -19 దృష్ట్యా ఏప్రిల్ 15 నుంచి సాధారణ రైళ్ల రిజర్వేషన్లను ముందుగానే నిలిపివేసింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అన్ని రైళ్లు మార్చి 25 నుంచి నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వారిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు మే 12 నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లను నడిపింది. ప్రారంభంలో 30 రాజధాని వంటి ఎయిర్ కండిషన్డ్ రైళ్లు ప్రారంభించారు. తర్వాత జూన్ 1 నుంచి 200 ఏసీ స్లీపర్ రైలు సర్వీసులు ఉన్నాయి

About The Author