జగనన్న వసతి దీవెన విద్యార్థులకు శుభవార్త…
కరోనా వైరస్ కష్టకాలంలో రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ‘జగనన్న వసతి దీవెన’, ‘జగనన్న విద్యా దీవెన’ పథకాలకు అర్హులైనా లబ్ధి పొందలేని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లబ్ధిదారులు ఎవరికైనా డబ్బు అందకపోతే అలాంటి వారు వెంటనే గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా పేర్లు నమోదు చేసుకుని వివరాలు అందించాలని ప్రభుత్వం సూచించింది. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అనంతరం ఈ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు వెల్లడించారు. ‘జగనన్న వసతి దీవెన’ కింద ప్రతి ఏటా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో రూ.20 వేలు జమ చేస్తోంది.
వసతి, భోజనం ఖర్చుల నిమిత్తం డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రెండు విడతలుగా ఈ డబ్బును వారి తల్లుల అకౌంట్లలోకి నేరుగా జమ చేస్తున్నారు. అటు ‘జగనన్న విద్యా దీవెన’ పధకం ద్వారా స్టూడెంట్స్ కాలేజీ ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.