తిరుపతి ప్రజల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మా..
తిరుపతి:ఆ రోజుల్లో…గంగమ్మ గుడి..మహిమ గల తల్లి.. తిరుపతి ప్రజల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మా.. మా ఊరి గ్రామదేవత తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం 1960-70 వ దశకంలో అంటే దాదాపు 60 ఏళ్ళ క్రితం ఇలా ఉండేది…
ఆలయపారంపర్య ధర్మకర్త స్వర్గీయ ఏకే శివప్రసాద్ గారు చెప్పిన వివరాల ప్రకారం ఆలయం చుట్టూ పెద్ద చెరువు ఉండేదని పెద్ద వర్షాలు వచ్చినపుడు గుడి నడుము లోతు నీళ్లతో నిండిపోయెదని చెప్పారు..ఆ నీళల్లో దిగి నడుచుకుంటూ వెళ్లి అమ్మవారికి అభిషేకం చేసిన సందర్భాలు అనేకం అని చెప్పేవారు.. 2008 లో సాక్షి పత్రిక ప్రారంభరోజుల్లో నేను మరియు రిపోర్టర్ నేతాజీ అన్న కలసి జాతరకు సంబంధించి భిన్నమైన కధనాలు..ఆరుదయిన పాత చిత్రాల సేకరణ అన్వేషణలో భాగంగా అప్పట్లో మాకు లభించిన చిత్రాల్లో ఒకటి ఈ ఫోటో… జాతర సమయాల్లో ఒక్కొక్క వంశస్తులు తమతమ పారంపర్య విధులను నిర్వహించేవారు..ప్రతి ఏటా మే నెలలో గంగజాతర వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది.. తిరుపతి కి సమీపంలోని అవిలాల గ్రామములోని గంగమ్మ పుట్టింటి నుండి పసుపు కుంకుమ తీసుకు రావడం.. మంగళవారం “కొడి” స్తంభంకు అభిషేకం తో జాతర మొదలవుతుంది..