అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం అవగాహన కార్యక్రమం
చిత్తూరు జిల్లా..అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని తిరుపతి, అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి అన్నారు.
ఎమ్మార్ పల్లి పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ యువత సరైన మార్గంలో వెళ్లకుండా, మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా ఉండటానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.ఇటీవల 1064 కిలోల గంజాయిని రాజమండ్రి నుంచి చిత్తూరుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.సమాజం
పట్ల అవగాహన లేకుండా ఉన్న యువత ఈ మత్తు పదార్ధాలకు బానిసలవుతున్నారన్నారు.తల్లి దండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.కరోనా వ్యాపిస్తున్న సమయంలో కూడా ఇలా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.సే నో టు డ్రగ్స్ అని జిల్లా వ్యాప్తంగా ప్రచారం
చేస్తామన్నారు.వీటిపై వ్రాత పరీక్ష పెట్టి బహుమతులు అందజేస్తామని అన్నారు.ఉదయం రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు చేసుకోవాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు