కరోనా పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని T.T.D ఈ ఓ
తిరుపతి 2020 జూన్ 29 తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీటీడీ ఈ ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్లో అదనపు ఈ ఓ శ్రీ ఏ వి ధర్మారెడ్డి, జె ఈ ఓ శ్రీ పి.బసంత్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్త, సివి ఎస్ ఓ శ్రీ గోపినాథ్ జెట్టి లతో సమావేశమయ్యారు. తిరుమలో పని చేసే ఉద్యోగుల నుంచి రోజుకు 100 కరోనా టెస్టు శాంపిల్స్ తీయాలని అధికారులను ఆదేశించారు. ఈ టెస్ట్ ల రిపోర్టులు 24 గంటల్లోగా వచ్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఈ ఓ కోరారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు వారం రోజులు ఒకే చోట పనిచేసేలా డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి సెంట్రల్ హాస్పిటల్లో ఉద్యోగుల కోసం కొన్ని వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పరిస్థితిని సమీక్షించి బర్ద్ ఆసుపత్రిని కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించే విషయంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని శ్రీ సింఘాల్ చెప్పారు. తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల సముదాయాన్ని జిల్లా కలెక్టర్ కు అప్పగించాలని జెఈఓ ను ఆదేశించారు. టీటీడీ