పి డి యాక్ట్  కూలీలపై కాదు యజమాని పై పెట్టండి – డిప్యూటీ  సి ఎం

టాస్క్ ఫోర్స్ వ్యవస్థ  ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించం – రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి 

తిరుపతి,జూన్ 29: ఎర్ర చందనం స్మగ్లర్ల పై నిఘా పటిష్టం చేయాలని, పీడీ యాక్ట్ లు కూలీలపై కాదు అందుకు మూల కారణమైన యజమానులపై పెట్టాలని అప్పుడే 90 శాతం స్మగ్లింగ్ నిరోధించగలమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  కె.నారాయణ స్వామి, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఎర్రచందనం అక్రమ రవాణా నిరోదానికి టాస్క్ ఫోర్స్ సమావేశం స్థానిక ఆర్ డీ ఓ కార్యాలయంలో డిప్యూటీ సీ ఎం, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి , జిల్లా కలెక్టర్  డా.భరత్ గుప్త తో కలిసి చిత్తూరు తిరుపతి ఎస్పీ లతో, ఫారెస్ట్ అధికారులతో సమీక్షించారు. డిప్యూటీ సీ ఎం మాట్లాడుతూ* ఎర్ర చందనం అక్రమ రవాణాలో చిన్న స్థాయి కూలీలపై పీడీ యాక్ట్ లు పెడుతున్నారని, ఇందుకు ప్రధాన కారణమైన యజమానులను గుర్తించి వారిపై పీడీ యాక్టు లు పెట్టాలని అన్నారు. ప్రజా ప్రతినిధులకు సంబంధించి ఎంతటి  వారైనా వదిలిపెట్టరాదని మంచి ఆశయం కోసం అధికారులు పనిచేయాలని అన్నారు. 

About The Author