రాక్ మెన్ ఉద్యోగులను ఆదుకోండి. మంత్రిగారికి సిఐటియు నేత విజ్ఞప్తి …
చిత్తూరు జిల్లా:శ్రీకాళహస్తి లోని రాక్ మెన్ కంపెనీ లో అక్రమంగా తొలగించిన 250 మంది కార్మికులను ఆదుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, వందవాసి నాగరాజులు విజ్ఞప్తి చేశారు. సోమవారం నాటి ఉదయం మంత్రి పెద్దిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి లను నేతలు కలిసి రాక్ మెన్ కంపెనీలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. గత నెల రోజులుగా కార్మికులు ఉపాధిలేక వీధుల పాలై ఆందోళన బాట పట్టారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు జోక్యం చేసుకుని సమస్య పూర్వాపరాలను జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా పరిశీలిస్తారని కార్మికులకు న్యాయం చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలకు హామీ ఇచ్చారు.