మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్…

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.. ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ వ్యవహారం మరువక ముందే.. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తుని మండలం సీతారాంపురం దగ్గర జాతీయరహదారిపై కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.. విశాఖపట్పం వైపు వెళ్తున్న కొల్లును.. సీతారాంపురం దగ్గర కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆయన్ను తుని నుంచి విజయవాడకు తరలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.. కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోకా భాస్కర్ రావును మచిలీపట్నంలో దుండగులు హత్య చేశారు..ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

About The Author