నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచేది లేదు

తిరుమ‌ల‌, 2020 జూలై 04నెలాఖ‌రు వ‌ర‌కు ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచేది లేదు,

ఉద్యోగులంద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించి రోజువారీ భ‌క్తుల సంఖ్య‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పెంచ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా జూన్ 8వ తేదీ నుంచి శ్రీ‌వారి ద‌ర్శ‌నం తిరిగి ప్రారంభించామ‌ని తెలిపారు. స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఏ ఒక్క భ‌క్తుడికీ క‌రోనా పాజిటివ్ రాలేద‌ని స్ప‌ష్టం చేశారు. భ‌క్తుల కోరిక మేర‌కు ఆన్‌లైన్ ద్వారా స్వామివారి క‌ల్యాణోత్స‌వం సేవ ప్రారంభించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌న్‌లో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. 

About The Author