దలైలామా పుట్టినరోజు చైనా ఆందోళన
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు ప్రాంతమైన తూర్పు లధాఖ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విదితమే. ఈ నేపధ్యంలో బారత్‌లో చైనా తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈరోజు టిబెట్ మత గురువు దలైలామా 85వ పుట్టినరోజు. ఈ సందర్భంగా భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి చైనాకు కంటగింపుగా మారాయనే వార్తలు వినిపిస్తున్నాయి. టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా నిరంతరం దలైలామాను వ్యతిరేకిస్తూ వస్తోంది. దలైలామా తన పుట్టినరోజు సందర్భంగా టిబెట్ స్వాతంత్య్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటనైనా చేయవచ్చని చైనా మరోసారి ఆందోళన పడుతోందని సమాచారం. ఈసారి దలైలామా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఆన్లైన్ స్క్రీనింగ్‌ను ప్లాన్ చేశారు. అ సమాచారాన్ని దలైలామా ట్విట్టర్ ద్వారా ముందుగానే తెలియజేశారు. ఈ నేపధ్యంలో దలైలామాను వ్యతిరేకిస్తూ చైనా ఏదో ఒకటి చేస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచానికి శాంతి, మానవత్వ సందేశాన్ని ఇచ్చే మత గురువుగా దలైలామా గుర్తింపుపొందారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దలైలామాకు ప్రత్యేక గౌరవం ఉంది. చైనా టిబెట్‌ను ఆక్రమించినప్పటికీ, టిబెట్‌తో భారత్‌కు ప్రత్యేక సంబంధం కొనసాగుతోంది. గత సంవత్సరం దలైలామా పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు,