కంటైన్మెంట్ జోన్లలో ఖచ్చితంగా లాక్ డౌన్ ను అమలు చేయడం జరుగుతుంది
చిత్తూరు జిల్లా:6o సం. ల పైబడిన వారు, 10 సం.ల లోపు పిల్లలు, గర్భిణీలు బయట తిరగరాదు,జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా,ప్రజలందరూ ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి . బయటకు వచ్చిన సమయంలో భౌతిక దూరం తప్పనిసరి
జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గారు సోమవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ కార్యాలయం వైయస్సార్ సమావేశం మందిరం నందు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగర పాలక సంస్థ అధికారులు, పోలీస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి రేపట్నుంచి కంటైన్మెంట్ జోన్ లలో కఠినమైన లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉంటాయని, ఒక వార్డులో 20 కరోనా కేసులు పైన ఉన్న వాటి లో షాపులు తెరువ కూడదని, కరోనా కేసులు తగ్గేవరకు రేపటి నుండి ప్రొవిజన్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు, చికెను, మటన్ షాపులు, బట్టల షాపు అన్ని రకములైన దుకాణాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనుమతి ఉంటుందని, మధ్యాహ్నం పైన దుకాణాలు తెరిచిన వారికి అపరాధ రుసుముతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.