జర్నలిస్టుల బీమా సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాలి.
తిరుపతి:రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై దశలవారీగా ఆందోళన చేయాలని కరోనాతో తిరుపతి లో నిన్న మృతిచెందిన సివిఆర్ టీవీ కెమెరామెన్ పార్థసారథి కుటుంబానికి యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని మచ్చా రామలింగా రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు జర్నలిస్టులపై సొసైటీ డిమాండ్ చేశారు,
అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఈరోజు ఉదయం జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మచ్చా రామలింగా రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు,
సమావేశానికి ముందు సివిఆర్ కెమెరామెన్ పార్థసారథి మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ మౌనం పాటించారు,ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ సివిఆర్ టీవీ యాజమాన్యం పార్థసారథి కుటుంబానికి 30 లక్షలు సహాయం చేయాలని లేనిపక్షంలో పోరాటం చేయక తప్పదని అన్నారు,రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోన బారిన జర్నలిస్టు పడుతున్నారని వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గారి కళ్యాణ యోజన పథకం కింద 50 లక్షల బీమా సౌకర్యాన్ని పోలీసులకి డాక్టర్లకు ఇచ్చిన విధంగానే జర్నలిస్టులకు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది
జర్నలిస్టుల సమస్యలపై 13 జిల్లాలు నియోజకవర్గాల్లో యూనియన్లకు అతీతంగా అందర్నీ కలుపుకొని పోరాటం చేయాలని సమావేశం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల సమస్యలపై చొరవ చూపాలని కరోనా వచ్చిన జర్నలిస్టులకు వైద్యం చేయించుకుంటూ నటువంటి జర్నలిస్టులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేష్ సీనియర్ జర్నలిస్టు ఉద్దండం చంద్రశేఖర్ సొసైటీ సెక్రటరీ విజయరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రసాద్ సభ్యులు బాలు ఆది షాకీర్ తదితరులు పాల్గొన్నారు
ఏపీ జర్నలిస్ట్ డెవలప్ మెంట్ సొసైటీ