70 లక్షల రూ విలువ చేసే అక్రమ మద్యం బాటిళ్ళు ధ్వంసం …


కృష్ణాజిల్లా మచిలీపట్నం : జిల్లా పోలీసు కార్యాలయం మచిలీపట్నం : కరోనా వైరస్ ప్రబలడంతో విధించిన లాక్ డౌన్లో అన్ని రకాల దుకాణాలు , షాపులు మూతపడ్డాయి . ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రం నుండి తక్కువ ధరలకు మద్యం తీసుకువచ్చి , అలా అక్రమ మార్గాలగుండా తీసుకువచ్చిన మద్యం బాటిళ్ళను అధిక ధరలకు విక్రయించి , సొమ్ము చేసుకుంటున్నారు . అక్రమ రవాణాదారులు . తెలంగాణా రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించే అక్రమ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ . జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీ మద్యపాన నిషేదంలో భాగంగా అక్రమ మద్యం , అక్రమ ఇసుక రవాణాను నియంత్రించే ఆలోచనతో నూతనంగా “ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ” య ఈబి ను ఏర్పాటుచేసి ప్రతి జిల్లాలకు ఒక ఐ.పి.యస్ . , సాయి అధికారులను కేటాయించడం జరిగింది . య ఈ బి ద్వారా ఎక్సైజ్ మరియు పోలీసు శాఖల సమన్వయంతో జిల్లా యస్పీ శ్రీ రవీంద్రనాధ్ బాబు య ఈ బి ఎయస్పీ వకుల్ జిందల్ ఐ.పి.యస్ . సారధ్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి , పోలీసు అధికారులతో య ఈబి బృందాలు , చెక్ పోస్టులు -ముబైల్ పార్టీలను నియమించి పొరుగు రాష్ట్రాలనుండి వచ్చే అక్రమ మద్యాన్ని కట్టడి చేసే విధంగా జిల్లా పోలీసు యంత్రంగం నడుం బిగించారు కృష్ణా జిల్లా పోలీసులు . య ఈ బి ఏర్పాటు అయిన నాటి నుండి అక్రమ ఇసుక , మద్యం రావాణాను అరికట్టడమే కాక , నదీ పరివాహక ప్రాంతాల్లో గుప్పుమంటున్న నాటుసారా పై కూడా ఉక్కుపాదం మోపేలా కార్యచర ణ ప్రారంభించారు . యఈబి ఏర్పడిన తర్వాత ఏపి ఎక్సైజ్ యాకు , ప్రొహిబిషన్ చాటాలను సవరణ చేయడం జరిగింది . గతంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి వాటిని డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి వద్ద ద్వసం చేయడం జరిగేది . అయితే నూతనంగా సవరణ చేసిన ఈ చట్టాల ద్వారా ఇలా సీజ్ చేయబడిన మద్యం సీసాలను ఎక్కువ కాలంపాటు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉంచడం వలన దొంగతనం , ఇతర మార్గాల ద్వారా చోరీకి గురి అవుతాయి , అలాగు పోలీస్ స్టేషన్లలో ఖాలీని ఆక్రమిస్తాయి అనే ఉద్దేశ్యంతో జిల్లాకు చెందిన యలు ఆ జిల్లాలోనే స్వాధీనం చేసుకున్న మద్యాం సీసాలను ద్వంసం చేసేలా జులై -02 న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడమైన ది , వచ్చిన ఉత్వర్వుల మేరకు రాష్ట్రంలో యస్పీలకు ఇచ్చిన అధికారం ప్రకారం కృష్ణాజిల్లాలో మొదటి సారి ఇప్పటి వరకు సీజ్ చేసిన మద్యం సీసాలను ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం ఆవర ణంలో పోలీసు అధికారులు , ఇతర శాఖల అధికారుల సమక్షంలో చట్టపరంగా ధ్వసం చేసే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు . ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నమోదు అయిన కేసుల వివరాలు . నమోదు చేసిన మొత్తం కేసులు – 312 , కేసులు నమోదు అయిన పోలీస్ స్టేషన్లు = 10 . స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ళు = 14,238 . ( లీటర్లలో = 3,207 ) స్వాధీనం చేసుకున్న నాటుసారా = 217 లీ . ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో అక్రమ మద్యం బాటిళ్ళ స్వాధీన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో డైరక్టర్ శ్రీ పిహెచ్ డి రామకృష్ణ ఐ.పి.యస్ . , గారు , ఏలూరు రేంజ్ డిఐజి శ్రీ కె.వి. మోహనరావు ఐ.పి.యస్ . జిల్లా యస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎయస్బీ శ్రీ వకుల్ జిందల్ ఐ.పి.యస్ . , గారు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్ని అక్రమ మద్యం ద్వంసం కార్యక్రమాన్ని ప్రారంభించా రు . ముందుగా పోలీసు అధికారులందరూ ద్వంసానికి సిద్ధం చేసిన మద్యం బాటిళ్ళను , నాటుసారా ను పరిశీలించి . ముందుగా 217 లీ నాటుసారాను డ్రైనేజీలో పారబోశారు . అనంతరం అక్కడున్న మద్యం బాటిళ్ళు , లేబుళ్ళను పరిశీలించి ముందుగా ఒక్కో బాటిల్ చేతిలోనికి తీసుకుని నేలపై వేసి ప గులగొట్టి కార్యక్రమం ప్రారంభించారు . రోడ్డు రోలోర్ సహాయంతో వివిధ పరిమాణాలలో వున్న 14,238 మద్యం బాటిళ్ళను తొక్కించి కార్యక్రమాన్ని పూర్తిచేశారు . ఈ సందర్భంగా యస్ ఈబి డైరక్టర్ శ్రీ పి.హెచ్.డి.రామకృష్ణ మాట్లాడుతూ మద్యం , ఇసుక అక్రమ రావాణాను నిరోధించే లక్ష్యంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని , ఏర్పాటుచేసిన ఈ రెండు నెలల కాలంలో రాష్ట్రంలో 300 శాతం లిక్కర్ , 200 శాతం ఇసుకను స్వాధీనం చేసుకుని , అధికంగా కేసులు నమోదు చేయడం జరిగి ందని , ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పోలీసులు అద్భుతమైన పనితీరును కనపర్చారని , కేవలం 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అయిన కేసులలో 14 వేలకు పైగా మద్యం బాటిళ్ళను స్వాధీనం చేస గున్న వాటిని ఈ రోజు ధ్వంసం చేయడం జరిగిందని , ఇదేరీతిగా ప్రతి జిల్లాలో అమలౌతుందని , కృష్ణా జిల్లా యస్పీ రవీంద్రనాధ్ బాబు , సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు . ఏలూరు రేంజ్ డి.ఐ.జి శ్రీ కె.వి. మోహనరావు మాట్లాడుతూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నాటినుండి ఇసుక , మద్యం అక్రమ రవాణాను చాలా వరథు కట్టడి చేశామని , తెలంగాణా నుండి ప్రవేశించే వాటిని అరి కట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని , తిరువూరు , మైలవరం , చింతపల్లి జిగురుమిల్లి వంటి ఖమ్మం బోర్డర్ చెక్పోస్టుల వద్ద తనిఖీలు మరింత ముమ్మరం చేశామని , అక్రమ మద్యం నియంత్రణ కోసం ముబైల్ పార్టీలను కూడా నియమించడం జరిగిందని తెలిపారు . ఇప్పుటు ఎక్సైజ్ చట్టాలను న వరణ చేయడంతో నాన్ బైలబుల్ చట్టాలలో 8 సంవత్సరాల జైలుశిక్ష అమలు అవుతుందని , మద్యం అక్రమ రవాణాకు పాల్పడినా , సహకరించినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగు తుందని , కృష్ణా జిల్లా పోలీసు వారు నాటుసారాను సమూలంగా నిర్మూలించే ఉద్దేశ్యంతో పరివర్తన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎన్నో కుటుంబాలు స్వచ్చందంగా ముందుకు వచ్చి నాటుసారాను వద లిపెట్టేలా ప్రతిజ్ఞపూనారని , అలా స్వచ్ఛందంగా నాటుసారాను వదలిని కుటుంబాలకు చెందిన యువ తీ యువకులుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని , ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకు ని అన్ని జిల్లాల్లో అమలుపరుస్తున్నారని తెలిపారు . జిల్లా యస్పీ శ్రీ రవీంద్రనాధ్ బాబు మాట్లాడుతూ ఎక్సైజ్ కేసులలో నమోదు అయిన మద్యం బాటిళ్ళను ల్యాబ్ కు పంపి కెమికల్ టెస్టులో నిరూపణ అయిన జిల్లాలో 10 పోలీస్ స్టేషన్లకు చెందిన 312 కేసులలో 14,238 మద్యం బాటిళ్లు , 217 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేయడం జరిగిందని , ఇక మున్ముందు రిపోర్టులు రావలసిన వాటికి కెమెకల్ రిపోర్టులు సేకరించి వా టిని కూడా ధ్వంసం చేయడం జరుగుతుందని , ఈరోజు షుమారు 70 లక్షల విలువైన మద్యం , నాటు సారాను ధ్వంసం చేశామని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అస్ స్టెంట్ కమిషనర్ కె . శ్రీనివాస్ , ఎఆర్ అడిషనల్ యస్పీ సత్యనారాయణ , స్పెషల్ బ్రాంచ్ డియస్పీ ధర్మేంద్ర , బందరు డియస్సీ మెహబూబ్ బాషా , సిఐలు , యస్సైలు పాల్గొన్నారు .

About The Author