పాత్రికేయులు నెల నెలకరోనా పరీక్షలు చేయించుకోవాలి..మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

తిరుపతి:తిరుమల పాత్రికేయుడు జంగం సుబ్రహ్మణ్యం మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇంచార్జ్ ఏం సుగుణమ్మ తెలిపారు.ఒక జర్నలిస్టుమరణము ప్రభుత్వానికి ఒక సంఖ్య మాత్రమే కానీ ఆ కుటుంబానికి  పెద్ద దిక్కు పోయినప్పుడు ఆ కుటుంబం యొక్క ఆవేదన,లోటు ఎవరో తీర్చలేనిదిగా పేర్కొన్నారు. జర్నలిస్టులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని విజ్ఞప్తిచేసినారు. నెలకు ఒకసారి పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని  కుటుంబాన్ని కాపాడుకోవాలని విలేకరులను కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ప్రజల యొక్క మనోవేదనను గుర్తించి అర్థం చేసుకుని దర్శనాల పై పున: సమీక్షచేసి వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వెంటనే  కఠినచర్యలు చేపట్టాలని మరొకసారి డిమాండ్ చేశారు.

About The Author