పరిమళించిన మానవత్వం…
మనం చనిపోయాక పాడె మోసేందుకు ఓ నలుగురు ఉండాలంటారు.దిక్కులేనివారికి ఆ దేవేడు దిక్కు అంటారు.కానీ మనిషి రూపంలో నిజంగానే దేవుడయ్యారు మన జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ.అనాధ శవాలకు అంత్యక్రియలు చేస్తున్నారు.ఒకటి కాదు..రెండు కాదు..ఇప్పటివరకు ఏకంగా వందలకు పైగా అంత్యక్రియలు చేశారు.ప్రస్తుతం అందరినోటా మానవత్వానికి మారుపేరులా సంస్థ పేరు మారు మోగుతోంది. వివరాల్లోకెళితే..జగిత్యాల జిల్లా అంగడి బజార్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి(40) భిక్షాటన చేస్తుంటాడు.గత వారం రోజుల క్రితం ఆరోగ్యం క్షిణించి మృతిచెందాడు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇంత వరకు తనకు సంబంధించిన వారు ఎవరు రాకపోవడంతో పోలీసులు మన జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ వారికి సమాచారం అందించగా మానవత దృక్పథంతో స్పందించిన వారు మృతదేహాన్ని తీసుకెళ్లి మోతె స్మశానవాటికలో ఖననం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.కాగా ఈ అంత్యక్రియలకై ఖర్చుని చింతల శిరీష గారు,దైవల బుచ్చిబాబు గారు భరించారు.ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు డెక్క శ్రవణ్,సింగం భూమేష్,నల్ల సురేష్,శ్రీకాంత్,కేఫా,బాబ్లు పాల్గొన్నారు.