వర్షాలతో వాగేటి కోన పనులకు అంతరాయం.
కడపజిల్లా,2020,జూలై,27,రైల్వేకోడూరు మండలం లోని వాగేటి కోన జలాశయం పనులకు వర్షంతో అంతరాయం ఏర్పడింది ఎన్నో దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న ఈ జలాశయానికి ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం వాగేటి కోన జలాశయం మరమ్మతులకు గాను 12.26 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టారు పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఇటీవల కురిసిన వర్షాలకు శేషాచల అడవులలోని వర్షపు నీరు ఆశయానికి చేరడంతో అక్కడ చేస్తున్న పనులకు అంతరాయం ఏర్పడింది. ఈ పనుల గురించి ఇరిగేషన్ శాఖ జే ఈ రాజన్నను వివరణ కోరగా జలాశయంలో వర్షపు నీరు చేరడంతో గత పది రోజులుగా పనులు ఆగిపోయాయని ప్రస్తుతం ఆ నీటిని పైలెట్ ఛానల్ ఏర్పాటు చేసే అలుగు ద్వారా నీటిని మళ్లించామని నీటిని తొలగించే త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.