గోవింద మొబైల్ యాప్‌లోనూ వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్లు

పూజాసామగ్రికి ప్ర‌త్యేక పూజ‌లు:

తిరుపతి,2020 జూలై 27;వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం టికెట్లు పొందిన భ‌క్తులకు అందించే ప్ర‌సాదాల‌కు సోమ‌‌వారం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో  ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముందుగా టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ ఎం.ర‌మేష్‌రెడ్డి ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌తో క‌లిసి పూజాసామ‌గ్రిని ఆల‌య ప్ర‌ద‌క్షిణ‌గా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ త‌రువాత అమ్మ‌వారి మూల‌విరాట్టు పాదాల వ‌ద్ద ఉత్త‌రీయం, ర‌విక‌, ప‌సుపు, కుంకుమ‌, గాజులు, అక్షింత‌లు, కంక‌ణాలు ఉంచి పూజ‌లు చేశారు. టికెట్లు బుక్ చేసుకున్న గృహ‌స్తుల గోత్రనామాలను అర్చ‌కస్వాములు అమ్మ‌వారికి నివేదించారు. అనంత‌రం ఈ పూజాసామ‌గ్రిని గృహ‌స్తుల‌కు బ‌ట్వాడా చేసేందుకు పోస్ట‌ల్ అధికారుల‌కు అంద‌జేశారు.

About The Author