ఏపీ పేదలకు సర్కార్ గుడ్ న్యూస్ ఇళ్ల నిర్మాణాన్నికి చౌక ధరకే సామాగ్రి…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న గృహ నిర్మాణ స్కీమ్ లో భాగంగా లబ్దిదారులకు రూ. 1.95 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని కంప్లీట్ చేసేలా అధికారులు ప్లానింగ్ రెడీ చేశారు. ఇందుకు కావాల్సిన నిర్మాణ సామగ్రిని లబ్దిదారుల ఇళ్లకే చేరవేయాలని నిర్ణయించారు. ఇసుకను ఫ్రీగా ఇవ్వడంతో పాటు..సిమెంటు బస్తా రూ. 225కు ఇవ్వనున్నారు. ఇటుకలు, తలుపులు, కిటికీలు, ఇనుప కడ్డీలు, విద్యుత్తు పరికరాలు, రంగులు, శానిటరీ వస్తువులు, మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే నిర్ణయించిన మొత్తంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నమూనా గృహాన్ని నిర్మించారు.