ప్రముఖ నటుడు, రచయిత రావి కొండలరావు(88) గుండెపోటుతో కన్నుమూత


1932, ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం లో జన్మించిన రావి కొండలరావు, ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు… సినీ దిగ్గజ రచయిత డి.వి నరసరాజు స్ఫూర్తితో రచయితగా, కాలమిస్టుగా, జర్నలిస్టుగా కూడా రావి కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు సినీ పరిశ్రమపై వ్రాసిన #బ్లాక్అండ్‌వైట్ అనే పుస్తకానికి గాను #నందిఅవార్డ్ ను అందుకొన్న రావి కొండలరావు సినీ కథా రచయితగా కూడా నందిని సొంతం‌ చేసుకొన్నారు.
బాపు దర్శకత్వంలో వచ్చిన చిత్రరాజం #పెళ్ళిపుస్తకం సినిమాకు కథను అందించడమే కాక, అందులో గమ్మడి సహాయకుడిగా సంభాషణలు లేని హావ,భావ అభినయాలతో రావి కొండలరావు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ చిరంజీవే…

ప్రముఖ నటి రాధాకుమారి రావి కొండలరావు సతీమణి, 2012 లో ఆవిడ మృతి చెందారు…
#RaaviKondalarao #BlackAndWhite #RaadhaKumari #Tollywood

About The Author