మతానికి అతీతమైన అపూరూప బంధం ఇదే కదా..


మతం మనిషికే తప్ప మనసుకి లేదు. మానవత్వానికి మతం లేదు. ప్రేమకి మతం లేదు. అటువంటి మతాలకు అతీతమైన సంబంధమే బాబూభాయ్ పఠాన్ ది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కి చెందిన బాబూభాయ్ పఠాన్ తాను పెంచుకున్న ఇద్దరు హిందూ యువతులకు, హిందూ సంప్రదాయంలో పెళ్లిళ్లు చేసి కన్నీళ్లతో అత్తారింటికి సాగనంపారు. తండ్రిలేని లోటుని మేనమామగా తీర్చాడు. ఈ యువతుల తల్లి భూసారి తనకు తోబుట్టువులు లేకపోవడంతో చిన్ననాటినుంచి బాబూభాయ్ కి ప్రతి ఏడాదీ అన్నలాగా భావించి రాఖీ కట్టేది. ఆ అనుబంధం అలాగే అన్నా చెల్లెళ్ల బంధం అయింది. భూసారి భర్త చనిపోయవడంతో ఆమె ఇద్దరి ఆడపిల్లల బాధ్యతను బాబూభాయ్ పఠాన్ తీసుకున్నాడు. వారిని పెంచి, చదివించి, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేసి బరువెక్కిన గుండెతో అత్తారింటికి సాగనంపారు.

About The Author