తిరుపతి స్విమ్స్ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ కొత్త బ్లాక్ లో ప్రమాదం
సంఘటన పై ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్….
సంఘటన జరిగిన తీరుపై తక్షణమే స్పందించిన మంత్రి ఆళ్ల నాని..
ప్రమాదం ఘటన పై తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నుండి వివరాలను ఫోన్ లో అడిగి తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని…
ఈ ప్రమాదంలో దురదృష్టవ శాత్తు ఒక ఉద్యోగి చనిపోవడం బాధాకరం…
కిటికీ పైన ఉన్న స్లాబ్ ఊడి పడిన ఘటనలో గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ కు మంత్రి ఆళ్ల నాని ఆదేశం…
ఈ ప్రమాదంలో మృతి చెo దిన అవుట్ సోర్చిo గ్ ఉద్యోగిని రాధిక కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆర్ధికంగా ఆదుకుంటాం….
ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వాలని ఇంజినీర్లను ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని… తిరుపతి స్విమ్స్ మొదటి అంతస్తులో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్విమ్స్ డైరెక్టర్ కు మంత్రి ఆళ్ల నాని ఆదేశం…
స్విమ్స్ లో కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం మొదటి బ్లాక్ లోకి వస్తున్న సమయంలో కరోనా పేషంట్స్ కు గాయాలు అయ్యాయి…
ఆకస్మికంగా పెచ్చు ఊడి పడటంతో ప్రమాదం జరిగింది…
పూర్తి విచారణకు ఆదేషించాము…. ఈ ప్రమాదం ఘటనలో ఎవరైనా బాద్యులు అని తేలితే చర్యలు తీసుకుంటాం….
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం… డిప్యూటీ సీఎం,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని
తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ ప్రమాదంలో మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు ఆర్ధిక సాయాన్ని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో మృతిచెందిన మహిళ కుటుంబానికి, గాయపడినవారి కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయమిచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశించినట్లు తెలిపారు.ఆదివారం అర్థరాత్రి తిరుపతి స్విమ్స్ పద్మావతి కోవిడ్ సెంటర్‌లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనం నాలుగో అంతస్థు నుండి దిమ్మెలు పడి ఓ మహిళా ఉద్యోగి మృతి చెందగా, మరో ఇద్దరు కోవిడ్ రోగులు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన మహిళ రాధిక 6 నెలల గర్భవతి కావడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. రెండేళ్ల క్రితం తన ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న రాధిక తిరిగి గర్భం దాల్చింది. కరోనా రోగులను లోపలికి, బయటకు తీసుకువెళ్ళే లేడీ అటెండర్ గా ఆమె పనిచేస్తోంది. భవనంలో 400 కు పైగా కోవిడ్ రోగులు ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో నిర్మాణంలో ఉన్న స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న రాధికపై పడటంతో ఆమె మృతి చెందింది. బిల్డింగ్ నాణ్యతగా లేకపోవడమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి కాని భవనంలో కోవిడ్ సెంటర్‌ను ఎలా పెడతారు ? అని విపక్షాలు, మహిళా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తపరిచాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిర్మాణ కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.