షార్ప్ షూటర్ సునీల్ గైక్వాడ్ ను ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్…


బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి, బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ రోషన్ పై కాల్పులు జరిపిన క్రిమినల్, షార్ప్ షూటర్ సునీల్ గైక్వాడ్ ను ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని శాంతాక్రజ్ తన ఆఫీసు బయట ఉన్నప్పుడు రాకేశ్ పై కాల్పులు జరిపాడు. మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరుపగా… రెండు బుల్లెట్లు రాకేశ్ శరీరంలోకి దూసుకుపోయాయి.

ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, నిన్న రాత్రి 9 గంటలకు పార్సిక్ సర్కిల్ కి గైక్వాడ్ వస్తున్నట్టు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఒక ట్రాప్ వేసి అతన్ని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడిపై 11 మర్డర్ కేసులు, 7 హత్యాయత్నం కేసులు ఉన్నాయని చెప్పారు. హత్యాయత్నం కేసుల్లో రాకేశ్ రోషన్ కేసు కూడా ఒకటి.

ఒక మర్డర్ కేసులో గైక్వాడ్ కు జీవితకాల శిక్ష పడింది. నాసిక్ సెంట్రల్ జైల్లో ఉన్న అతను ఈ ఏడాది జూన్ 26న 28 రోజుల పెరోల్ పై బయటకు వచ్చాడు. అయితే పెరోల్ ముగిసినా అతను జైలుకి తిరిగి వెళ్లలేదు. తప్పించుకు తిరుగుతున్నాడు. నిన్న రాత్రి వలపన్ని అతన్ని అరెస్ట్ చేశారు.

About The Author