ఏపికి 5,051 కోట్ల అప్పుకు కేంద్రం అనుమతి….
జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాల్సిన ఉన్న కేంద్రం… రాష్ట్రాలకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పించింది. 20 రాష్ట్రాలు మరో రూ. 68వేల కోట్లకు పైగా రుణాన్ని ఆర్బీఐ నుంచి తీసుకొనే ప్రత్యేక వెసులుబాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం 2.35 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్బీఐ వద్ద ప్రత్యేక వెసులుబాటు ద్వారా రూ.97,000 కోట్లు రుణం తీసుకోవాల్సిందిగా కేంద్రం సలహా ఇచ్చింది. లేదంటే పరిహారం మొత్తం మార్కెట్ నుంచి తీసుకోవాల్సిందిగా సూచించింది. *తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాలు పరిహారాన్ని కేంద్రమే ఇవ్వాలని పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ద్వారా రుణం తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసిన 20 రాష్ట్రాలకు కేంద్రం ఇవాళ అనుమతి ఇచ్చింది.* కేంద్ర ప్రతిపాదనకు ఓకే చెప్పిన ఏపీ తన వంతుగా రూ. 5,051 కోట్ల అప్పుగా తీసుకోవడానికి కేంద్ర అనుమతి లభించింది.