పీవీ న‌ర‌సింహారావు ఎక్స్‌ప్రెస్ వే మూసివేత…


హైద‌రాబాద్ : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. న‌గ‌రంలో వాన‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అధికారులు స‌మీక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో పీవీ న‌ర‌సింహారావు ఎక్స్‌ప్రెస్ వేను మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రాక‌పోక‌ల నిషేధం కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. మెహిదీప‌ట్నం వ‌ద్ద పోలీసులు వాహ‌న‌దారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

గ‌త రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్‌లోని స‌ఫారీ పార్క్ స‌హా మ‌రికొన్ని స్థ‌లాల్లో వ‌ర‌ద‌నీరు చేరింది. దీంతో జూపార్కును మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

వాన‌ల తాకిడికి మాదాపూర్‌లోపి శిల్పారామంలో ఉన్న‌ భారీ వృక్షాలు నేల‌కూలాయి. దీంతో ఇవాళ శిల్పారామం మూసివేస్తున్న‌ట్లు నిర్వ‌హ‌కులు ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఉప్ప‌ల్ శిల్పారామంలో భారీగా వ‌ర్ష‌పు నీరు చేరింది. వ‌ర‌ద ప్ర‌వాహంతో చెట్లు కూలిపోయాయి. ఈకార‌ణంగా శిల్పారామాన్ని ఈరోజు మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

About The Author