కమలం గూటికి చేరిన సినీ నటి కుష్బూ…
Kushboo | రీసెంట్‌గా కాంగ్రెస్ పార్టీకి చెయ్యి ఇచ్చి కమలం గూటికి చేరింది సినీ నటి కుష్బూ. కాంగ్రెస్ పార్టీకి అలా రాజీనామా చేయడమే ఆలస్యం.. వెంటనే కాషాయ కండువా కప్పుకున్నారు. డీఎంకే పార్జీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కుష్బూ…2014లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తమిళనాడు, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం కమలం గూటికి చేరిన సందర్భంగా కుష్బూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆమెను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి
ఆమె పై ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పోలీస్ స్టేషన్స్‌లో కుష్బూపై ఫిర్యాదు చేశారు. కాషాయ కండువా కప్పుకున్న సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు నేను మానసిక వికంలాగుల పార్టీలో ఉన్నానంటూ.. ఇపుడాలాంటి పార్టీ నుంచి నేను నిష్క్రమించానంటూ సెటైర్లు వేసింది. ఈ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానపరిచినట్టేనని ఎన్‌పీఆర్‌డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెపై దాదాపు 30 పీఎస్‌లలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
బీజేపీలో చేరిన కుష్బూ సుందర్
దాంతో పాటు మురళీధరన్.. కుష్బూపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. చెన్నై, కంజిపురం, చెంగల్‌పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్ తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయి . రాజకీయ ప్రత్యర్థులపై ఏమైనా మాట్లాడే హక్కు కుష్భూకు ఉన్నప్పటికీ.. అంగ వైకల్యం, ఇతరులను ప్రతికూలంగా సూచించే పదాలను వాడడం ఆమోదయోగ్యం కాదన్నారు మురళీధరన్. మరి దీనిపై కుష్బూ సుందర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.