కరోనా నియమాలను పాటిస్తూ పండుగ జరుపుకుందాం.. పాలవలస యశస్వి



కరోనా నియమాలను పాటిస్తూ పండుగ జరుపుకుందాం..
~జనసేన పొలిటికల్ ఎఫ్ఫైర్స్ కమిటీ సభ్యురాలు పాలవలస యశస్వి
*ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మవారి పండుగ మహమ్మారి కరోనా వలన ప్రజలందరూ కరోనా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా చేసుకోవాలని జనసేన నాయకురాలు, పొలిటికల్ ఎఫ్ఫైర్స్ కమిటీ సభ్యురాలు శ్రీమతి పాలవలస యశస్వి గారు పిలుపునిచ్చారు.*
*శుక్రవారం ఉదయం స్థానిక అంబేద్కర్ భవన్ లో పత్రికాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ఉత్సవంగా చేసుకోవాల్సిన అమ్మవారి పండుగను మహమ్మారి కోవిడ్ వలన చేసుకోలేకపోతున్నామని త్వరలోనే మహమ్మారి కోవిడ్ అంతరించిపోవాలని,* *కోరుకుంటూ ప్రజలందరూ సుఖశాంతులతో కోవిడ్ నియమాలను పాటిస్తూ పోలీసువారికి,జిల్లా* *యంత్రాంగంనకు ప్రజలందరూ సహకరించి సంప్రదాయం ప్రకారం అమ్మవారి పండుగను చేసుకోవాలని అన్నారు.* *అలాగే ప్రతియేడాది అమ్మవారి పండుగ సమయాల్లో పట్టణంలో రోడ్డు మరమ్మతులు చేపట్టేవారు.* *కానీ ఈ సంవత్సరం రోడ్లుఅన్నీ పాడైపోయినా..* *స్థానిక శాసనసభ్యులు గాని ఇటు జిల్లా యంత్రాంగం గాని దృష్టి పెట్టలేదని, కనీసం మంచినీరు కొన్నిప్రాంతాల్లో బురదనీరు వస్తుందని..* *మున్సిపల్ కార్పోరేషన్ పైన,జిల్లా అధికారులపైన దుయ్యబట్టారు. త్వరలోనే ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.*

*జనసేన నాయకులు శ్రీ ఆదాడ మోహన్ రావు గారు మాట్లాడుతూ 141 ఏళ్ల చరిత్ర కలిగిన మహారాజ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయం, జనసేన వ్యతిరేకమని, స్థానిక అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు చదువుకున్న విద్యాదేవాలయం పై మాట్లాడకపోవడం శోచనీయం అని ఏటా నాలుగువేల విద్యార్థుల బతుకులు రోడ్డునపడనున్నాయని జనసేన తరుపున* *సాయశక్తులా మహారాజ కళాశాల కోసం పోరాడతామని అన్నారు. అనంతరం యశస్వి గారి ఆధ్వర్యంలో మహారాజ కళాశాల వద్ద శాంతియుతంగా ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.*


*ఈ కార్యక్రమంలో ఝాన్సీ వీరమహిళలు గంట్లాన పుష్పకుమారి గారు,గాయత్రీ గారు, ముదిలి సర్వమంగల గారు,ఈశ్వరి గారు,జనసేన నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు),వంక నరసింగరావు గారు,ఏంటి రాజేష్,రవితేజ, ఎర్నాగుల చక్రవర్తి,కిలారి ప్రసాద్,రౌతు సతీష్ గారు,యోగేష్,లోపింటి కళ్యాణ్, వంకర సురేష్,భాస్కరరావు,తదితరులు పాల్గున్నారు.*

About The Author