మన్నెం బిడ్డ ‘కొమరం భీమ్’ వచ్చేసాడు!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైన విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ముందు చెప్పినట్లుగానే ఈరోజు కొమరం భీమ్ వీడియోను విడుదల చేసారు. మొత్తం ఐదు భాషల్లో ఈ స్పెషల్ వీడియో విడుదలైంది. ఎన్టీఆర్ విజువల్స్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయనే చెప్పాలి. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కుమ్మేసారు. ఆ దేహ ధారుడ్యం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అదిరిపోయింది. ముఖ్యంగా రెండు కొక్కాలు కలిపే సీన్ లో ఎన్టీఆర్ ఓ పోరాట యోధుడిగా అద్భుతంగా కనిపించారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ కు బ్రహ్మాండమైన ఎలివేషన్ ఇచ్చారు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా సూపర్బ్ గా వర్కౌట్ అయింది. “వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్నెం ముద్దు బిడ్డ, నా తమ్ముడు గొండు బెబ్బులి” అంటూ రామ్ చరణ్ ఇచ్చిన వాయిస్ సూపర్. దానికి ఎన్టీఆర్ విజువల్స్ ఇంకా సూపర్. మొత్తానికి కొమరం భీమ్ టీజర్ ప్రేక్షకులను రోమాంచితులని చేస్తోంది. ఇక ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది.

About The Author