6 వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కుప్పం

https://youtu.be/iQnilBw0UFo

6 వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కుప్పం ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్6 నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం పలు శంఖుస్థాపన లు ప్రారంభోత్సవాలు గావించారు.
1. జలవనరుల శాఖ చే రూ.5.8 కోట్లతో కుప్పం మండలం మిట్ట పల్లి గ్రామం మంజల మడుగు చెక్ డాం పునరుద్ధరణ కు శంఖుస్థాపన
2. గృహ నిర్మాణ శాఖ చే కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా రూ.100 కోట్ల తో 2 వేల బహుళ అంతస్తుల గృహ నిర్మాణానికి శంఖుస్థాపన.
3. రూ.3.86 కోట్ల తో నిర్మించిన కుప్పం , గుడిపల్లి, శాంతిపురం ( ఒక్కొక్క మోడల్ స్కూల్ వసతి గృహం కి రూ.128.81 లక్షలు) మండలాల మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ లకు ప్రారంభోత్సవం
4. రూ.180 లక్షల తో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ లలో భాగంగా శాంతిపురం మండలం రాళ్ళ బుదుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం
5. రూ.20 కోట్ల తో వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాల మరియు కళాశాల కు శంఖుస్థాపన
6. రూ. 1 కోటి తో కుప్పం కాపు భవన్ కు శంఖుస్థాపన

★2029 నాటికి భారత దేశం లో ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి లో మొదటి స్థానం లో నిలుపుదాం
★అర్హులందరికీ పెన్షన్ లు, రేషన్, ఇండ్లు మంజూరు చేస్తాం
★క్షేత్ర స్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచి మెరుగైన జీవితాన్ని అందించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం
★అవినీతి లేని రాష్ట్రం గా ప్రథమ స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ ను ఉంచేందుకు కృషి
★కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజలు మంచికి నమ్మకానికి మారు పేరు
★పేదరికం లేని సమాజం నిర్మాణమే ఈ ప్రభుత్వ లక్ష్యం
: ముఖ్యమంత్రి
గత నాలుగున్నర సంవత్సర కాలం లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించేందుకు 6 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ఉద్దేశం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 6 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమాన్ని కుప్పం వడ్డి పల్లి నందు లాంచనం గా ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి మారు పేరని ఈ ప్రాంత ప్రజలు మంచికి నమ్మకానికి పేరని తెలిపారు. అభివృద్ధి అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలని కుప్పం నుండి ఎం ఎల్ ఏ గా పోటి చేసి ప్రజల అభిమానం తో కుప్పం ప్రజల స్ఫూర్తి తో జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కుప్పం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో బయటకు వచ్చి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు జరిగిన అన్యాయం పై కేంద్రం తో పోరాడుతున్నామని, అయినప్పటికీ భారత దేశం లో ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి లో ప్రథమ స్థానం లో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. వర్షపు నీటిని సంరక్షణ చేయడానికి 10 లక్షల ఫారం పాండ్లను త్రవ్వించామని, మన జీవ నాడి అయిన పోలవరం పనులు 63 శాతం పూర్తి అయినాయని కేంద్రం నిధులు ఇవ్వనప్పటికీ పోలవరం ను పూర్తి చేసి మన సత్తా నిరూపిస్తామని కుప్పం కు త్వరలో హంద్రి – నీవా నీళ్ళను తీసుకుని వస్తామని తెలిపారు. వ్యవసాయ రంగం లో 11 శాతం కు పైగా వృద్ధి సాధించామని, రైతులకు 24 వేల కోట్ల రుణ మాఫీ చేసామని రైతన్నలకు అండగా ఉంటామని తెలిపారు.రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని, వారందరూ ఆనందం ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఆర్ధిక సామాజిక సాధికారత సాధించేందుకు మరియు పేదరికం పై గెలుపు సాధించేందుకు డ్వాక్రా మహిళలకు అండగా ఉంటూ పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికీ రూ.10 వేలు అందించామని, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్ళికానుక ద్వారా బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్నామని, పేదరికం లేని సమాజం నిర్మాణమే ఈ ప్రభుత్వ లక్ష్యమని, లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. చీలా పల్లె పంచాయతి 8 స్టార్స్ సాధించిందని తెలిపారు. జెడ్ బి ఎం ఎఫ్ ను మరింత ఎక్కువ మంది రైతులు అనుసరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా పారదర్శక పాలన సాగిస్తున్నామని, ప్రతి ఇల్లు నాలెడ్జ్ సిటీ గా మారిందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని, ఇది ఒక చరిత్ర అని ప్రజలందరూ ఆరోగ్యం గా, ఆనందం గా ఉండేందుకు కృషి చేస్తున్నామని, రూ.2 వేల కోట్లు చంద్రన్న బీమా అందించామని, వర్చ్యువల్ క్లాస్ రూముల ద్వారా విద్యార్థులకు టెక్నాలజీ తో కూడిన పాఠాలను బోధిస్తున్నామని, తిరుపతి – సత్యవేడు ఎలక్ట్రానిక్ హబ్ గా మారుతుందని, రాష్ట్రావ్యాప్తంగా 33 లక్షల ఎల్ ఈ డి బల్బ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఊబరై జేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, పెన్షన్ ల పంపిణీ పై ఆన్ లైన్ లో చెక్ చేయడం జరుగుతుందని, ప్రతి మనిషి కి ఆధార ఉన్నట్లే భూమి కి భూదార్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో భాగంగా చీలాపల్లె గత నాలుగున్నర సంవత్సరం లో కుప్పం మండలం సాధించిన ప్రత్యేక అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు. ఈ కార్యక్రమం లో భాగంగా జన్మభూమి ప్రతిజ్ఞను ముఖ్యమంత్రి చదవగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథ రెడ్డి, ఎం పి శివ ప్రసాద్, ఎం ఎల్ సి గౌనివాని శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న, రేస్కో చైర్మన్ మునిరత్నం, జే సి గిరీష, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి, జే సి 2 చంద్రమౌళి ఇతర జిల్లా స్థాయి అధికారులు,ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

About The Author