రాష్ట్రంలో మందుబాబులకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్….


?మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
?ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేయగా..
?పర్మిట్ లేకుండా మద్యం
తెచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.
?3 మద్యం సీసాలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు
అనుమతి లేదన్న ప్రభుత్వం..
?ఇతర దేశాల నుంచి
మద్యం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు
మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రక్క రాష్ట్రం నుండి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం బాటిల్ లకు చెక్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.
———————————————.
రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కంకణం కట్టుకున్న సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో దశల వారీ మద్యనిషేధాన్ని సక్రమంగా అమలు చేస్తున్న తరుణంలో మన రాష్ట్రం సరిహద్దుల్లోవున్న
ఆరు రాష్ట్రాల్ల నుండి ఒక్కొక్కరు మూడు బాటిల్స్ లకు మించకుండా మద్యం తీసుకొనిరావటాన్ని నిరోదిస్తూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.1968 ఎక్సైజు చట్టంలోని 34వ నిబంధనలను అనుసరించి ఇక మీదట ఏ ఇతర రాష్ట్రం వారు మన రాష్ట్రానికి మద్యాన్ని తరలించడానికి అవకాశంలేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం అక్రమ రవాణా నిరోధించడానికి ఈ నోటిఫికేషన్ తోడ్పడుతుందని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

About The Author