బీజేపీకి డిపాజిట్ దక్కదు. – కాంగ్రెస్ గెలిచే పార్టీ కాదు…మంత్రి శ్రీ హరీష్ రావు
బీజేపీకి డిపాజిట్ దక్కదు.
– కాంగ్రెస్ గెలిచే పార్టీ కాదు.
– బీజేపీ డిపాజిట్ కోల్పోవడంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.
– ఓడిపోతమానే సిద్దిపేటలో బీజేపీ డబ్బుల డ్రామా
దౌల్తాబాద్ మండలం దొమ్మటా గ్రామం లో ఎన్నికల ప్రచారం లో భాగంగా..
• కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు తెరాస, గులాబీజెండా కష్టపడితే తెలంగాణ వచ్చింది.
• కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా మనకు జరిగింది ఏమీ లేదు.
• ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణకు ఏం లాభం జరగలేదు.
• తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ తాగడానికి నీరు ఇంటింటికి వచ్చేలా చేశారు.
• నీళ్ల బాధ కాంగ్రెస్ తీర్చిందా.? బీజేపీ తీర్చిందా.? ఏ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసు
• బీజేపీ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏక్కడైనా ఉచిత కరెంటు ఇస్తున్నారా..?! కాంగ్రెస్ ఇస్తుందా ఏ రాష్ట్రంలోనైనా..?
• బాయిలకాడ, బోర్ల కాడ బీజేపీ మీటర్లు పెట్టాలంటోంది. మీటర్లు పెట్టాలంటారా..?!
• కాంగ్రెస్ అంటే కాలిపోయే మీటర్లు. బీజేపీ అంటే బోర్లు, బావుల కాడ మీటర్లు, కారు గుర్తంటే 24 గంటల ఫ్రీ కరెంటు.. ఏది కావాలో రైతులు ఆలోచించాలి.
• దొమ్మాటలో 1 కోటీ 53 లక్షల రూపాయలను రైతు బంధు కింద 1338 మందికి ఎకరానికి 5 వేలు వానాకాల పంటకు ఇచ్చారు. దీపావళి తర్వాత మరో 5 వేలు సీఎం ఇస్తారు.
• కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రైతు శిస్తు అని వివధ రకాలుగా పన్నులు వసూలు చేస్తే..తెరాస వచ్చాక రైతుకే సీఎం కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారు.
• ఎరువులు కోసం గోస ఏక్కడైనా తెరాస పాలనలో ఉందా… రైతు బీమా 5 లక్షలు రైతు చనిపోతే ఇస్తున్నామా లేదా.?!
• మహిళలను బీజేపీ, కాంగ్రెస్ నేతలు తక్కువ చేసి చూస్తున్నారు. వారికి దుబ్బాక మహిళలు బుద్ది చెప్పాలి.
• బీజేపీకి మూడో సారి డిపాజిట్ కోల్పోవడంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.
• ఓడిపోతమని సిద్దిపేటలో నిన్న బీజేపీ హై డ్రామా
• డబ్బులు నీ ఇంట్లోవి కాకపోతే ప్రచారం మానేసి ఎందుకు సిద్దిపేట పరుగెత్తుకొచ్చారు.
• మీ మామ, అత్త డబ్బులు దుబ్బాక ఓటర్లకు పంచడానికే అన్న వీడియోలు విడుదలయ్యాయి.
• బీజేపీ అభ్యర్థిది పని చేసే ముఖామే అయితే ప్రజలకు పైసలు, సీసాలు, చీరేలు పంచి ఓటు అడుగుతారా.!??