వాల్మీకి మహర్షి జయంతి
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ ఐ.పి.యస్
ఈ రోజు దేశ సమగ్రతను కాపాడిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని యువత స్ఫూర్తి గా తీసుకోవాలని ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి గారు స్థానిక పోలీస్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ చిత్ర పటానికి పూల మాల వేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని కూడా చిత్ర ప్రతానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు. ఈయనను సంస్కృత భాషకు ఆదికవిగా ప్రసిద్ధి, వాల్మీకి మహర్షి సంస్కృతి సాహిత్యంలో పేరెన్నికగల కవి అని తెలిపారు. ఈయన వేడుకలను కూడా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
అనంతరం అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి సుప్రజ మేడం గారు పోలీస్ అధికారులు, డి.పి.ఓ స్టాఫ్, పోలీస్ సిబ్బంది అందరిచే ప్రతిజ్ఞ చేయించినారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్రంగా (హైదరాబాద్, జునాగడ్) ఉన్న సంస్ధానాలన్నింటిని వారు తిరస్కరించిన పట్టుదలతో దేశంలో విలీనం చేసి సుస్ధిరమైన దేశంగా తయారు చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలక పాత్ర వహించారన్నారు. పటేల్ గారు పలు ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. వల్లభాయ్ పటేల్ గారు దేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1991 లో భారత రత్న బిరుదు ఇచ్చి సత్కరించిందన్నారు. పటేల్ సందేశాన్ని యువత, ప్రజలు పాటించాలన్నారు. దేశం యొక్క సమగ్రత, ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. భద్రత, సమగ్రత పరంగా అందరము కలిసి భారతదేశాన్ని రక్షించుకుంటామని (National Unity Day) అక్టోబర్ 31 ని ఐక్యతా దినంగా జరుపుకుంటున్నామన్నారు.
ప్రతిజ్ఞ
“దేశ ఇక్యమత్యం, సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని అంతేకాక ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తామని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నామని, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్య వల్ల లభ్యమైన మన దేశ ఏకీకర ణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాము. అంతే గాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వీయ తోడ్పాటును అందిస్తామని సత్యనిష్టతో ఈ తీర్మానం చేస్తున్నాము.” ఈ కార్యక్రమాలలో డి.యస్.పి యస్.బి గంగయ్య, సైబర్ ల్యాబ్ రవి కుమార్, క్రైమ్ మురలిదర్, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, SKHT నాగసుబ్బన్న, తిరుమల రమణ కుమార్, ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.