నకిలీ మిలిటరీ మధ్యం కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రధారులు అరెస్ట్…
నకిలీ మిలిటరీ మధ్యం కేసులో ప్రధాన సూత్రదారి, పాత్రధారులు అరెస్ట్ మరియు వారి వద్ద నుండి రూ. 18,00,000/- విలువ గల 1500 నకిలీ మిలిటరీ మద్యం బాటిళ్ళు, లగేజ్ ఆటో మరియు CPU లు స్వాధీనం.
చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ నందు గత నెల 22/10/2020 వ తేదిన నకిలీ మిలిటరీ మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకొని ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన విషయం తెలిసినదే. ఈ కేసు ను చిత్తూరు జిల్లా యస్.పి శ్రీ సెంథిల్ కుమార్ IPS మరియు SEB ASP శ్రీ రిశాంత్ రెడ్డి IPS గార్లు ప్రతిష్టాత్మకం గా తీసుకొని, ఈ కేసు యొక్క మూలాలను చేదించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారి చేసి, చిత్తూరు డి.యస్.పి శ్రీ ఈశ్వర్ రెడ్డి గారి స్వీయ పర్యవేక్షణ లో, చిత్తూరు రూరల్ ఈస్ట్ సి.ఐ శ్రీ కే. బాలయ్య, చిత్తూరు తాలుకా యస్.ఐ యన్.విక్రమ్, సిబ్బంది రాజ్ కుమార్, సుధాకర్ గల బృందం గోవా లో 24/10/2020 వ తేది ఈ కేసు లో ప్రధాన సూత్రదారి అయిన మారి రాజన్ @ రాజన్ @ పాండియన్ ను అరెస్ట్ చేసి, అక్కడ సంబదిత కోర్ట్ వారి ఎదుట హాజరుపరిచి చిత్తూరు కి తీసుకొని వచ్చి 26/10/2020 వ తేది చిత్తూరు కోర్ట్ లో హాజరు పరచడం జరిగినది. కేసు దర్యాప్తు లో భాగం గా ప్రధాన సూత్రదారి అయిన మారి రాజన్ @ రాజన్ @ పాండియన్ ని పోలీస్ కస్టడి కి తీసుకొని విచారించగా ఈ క్రింది విషయాలు వెలుగులోకి వచ్చినాయి.
“ మారి రాజన్ @ రాజన్ @ పాండియన్ భారత ఆర్మీ లో హవిల్దార్ హోదా లో 2000 వ సంవత్సరం లో రిటైర్డ్ అయి, ప్రస్తుతం గోవా లో నివాసం వుంటూ, గోవా లో మద్యం తక్కువ ధరకు మరియు సులభం గా లభ్యం అవ్వడం, మిలిటరీ మద్యానికి వున్న డిమాండ్ ని సొమ్ము చేసుకోవాలని, సుమారు ఒక సంవత్సరం క్రితం గోవా లో ఒక లిక్కర్ ఫాక్టరీ యజమాని తో ఒప్పందం చేసుకొని, బాటిల్ పైన వున్నమూతలు కొని, బెంగళూరు లోని ప్రింట్ హౌస్ నడిపే రమేష్ అను వ్యక్తి ద్వార White Field Premium Brandy మరియు Blue dart matured white rum అను బ్రాండ్ పేరుతో అక్రమం గా లేబుల్ లు తయారు చేయించి, టిన్ ఫ్యాక్టరీ నుండి ఐరన్ బారెల్ కొని, వాటి పైన Dublux Paints పేరుతో ముద్రించి, ఆ బారెల్ లలో మద్యం బాటిళ్ళను వుంచి, పెయింట్ కంపెనీ పేర్లతో గోవా నుండి వివిధ పార్సెల్ సర్వీసెస్ ద్వారా బెంగళూరు కి పంపి, బెంగళూరు లో అతనికి గతం లో పరిచయం వున్న కేశవ మూర్తి @ కృష్ణ మూర్తి మరియు ఇస్మాయిల్ లను ఇందులో కలుపుకొని వారి ద్వారా పార్సెల్ సర్వీసెస్ నుండి తీసుకొని, బెంగలూరు లోని దాసరహళ్లి లో రూమ్ లో స్టాక్ వుంచి, అక్కడ నుండి వివిధ పార్సెల్ సర్వీసెస్ ద్వారా వేరు వేరు వ్యక్తులకు కర్నాటక రాష్ట్రము లోని బెంగుళూరు, కోలార్, చింతామణి, ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు, తిరుపతి, రాయచోటి, తమిళనాడు రాష్ట్రము లో దిండిగల్, తిరుచ్చి, పాలయం కోట్టై, క్రిష్ణగిరి, మార్తండమ్, అరుపు కోట్టై, తిరునల్వేలి, మదురై జైహింద్ పురం మొదలగు ప్రదేశాలకు వివిధ వ్యక్తులకు నకిలీ మిలిటరీ మద్యాన్ని సరఫరా చేసి అక్రమార్జన చేసినట్లు గుర్తించడమైనది”.
నిన్నటి దినము, మారిరాజన్ యొక్క ఒప్పుకోలు మేరకు, బెంగళూరు లోని దాసరహళ్లి లోని గది వద్ద కేశవ మూర్తి @ కృష్ణ మూర్తి ని అరెస్ట్ తీసుకొని, వారు ఒక గది లో దాచి వుంచిన 30 బారెల్ లలో White Field Premium Brandy – 900 మరియు Blue dart matured white rum- 600 మొత్తం 1500 నకిలీ మిలిటరీ మద్యం బాటిళ్ళు, వాటిని రవాణా చేయడానికి ఉపయోగించిన Ape luggage auto ను, అక్రమం గా లేబుల్ లు తాయారు చేసి ఇచ్చిన ప్రింట్ హౌస్ యజమాని రమేష్ ను బెంగళూరు లో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక CPU ను స్వాధీనం చేసుకోవడం జరిగినది. ఈ కేసు లో మిగిలిన ముద్దాయిలు అరెస్ట్ గురించి ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగింది.
ముద్దాయి ల వివరాలు:
1. M. Mari Rajan @ Rajan @ Pandiyan, age 56 years caste by Kamma, s/o late M.A. Swamy, Row No.2, Benaulin road, Madagao, South Goa, Goa State, native of Villama Street, Vellamadam, Thovaala Taluk, Kanyakumari District, Tamilnadu State. (ప్రధాన సూత్రదారి).
2. A.Keshava Murthy @ Krishnamurthy, aged 44 years, S/o late Ashwathapaa, resident Babanna lay out, Malsandra, T.Dasarahalli, Bangalore City, Karnataka State. Native of Cholasamudram village, Lepakshi Mandal, Anamnthapuram district, AP.,
3. S.Ramesh, aged 22 yrs, S/o Subramanyam, D.No: 12/23, 3rd main, Cable Road, Cholupalya, Banglore. ( House Owner)