టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి పై బీజేపీ నాయకులు చేసిన దాడి పై మాట్లాడిన మంత్రి శ్రీ హరీష్ రావు…
టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి పై బీజేపీ నాయకులు చేసిన దాడి పై మాట్లాడిన మంత్రి శ్రీ హరీష్ రావు
– టీఆర్ఎస్ పార్టీ కి ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి, ఓర్వలేక బిజేపీ నాయకులు పని గట్టుకొని నియోజకవర్గం అవతల ప్రాంతంలో ఉన్న ఒక దళిత ఎమ్మెల్యే పై భౌతిక దాడులకు దిగడం చాలా శోచనీయం.. ఇది హేయమైన చర్య .. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న
– ఇది ఉద్దేశ పూర్వకంగా పథకం ప్రకారం కావాలని, వాళ్ళు ఉంటున్న హోటల్ కి వెళ్లి వారి పై భౌతిక దాడులకు పాల్పడటం వారి దిగజారుడు తనానికి నిదర్శనం..
– మాజీ ఎంపీ, దుబ్బాక బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ జితేందర్ రెడ్డి రామాయం పేట లోని రెడ్డి కాలనీ లో ఉంటే తప్పు లేనిది.. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిద్దిపేట లో ఉంటే తప్పు ఏంటి.. ఇది ఉద్దేశ పూర్వకమైన దాడి..
– నిన్న మొన్న కొన్ని యాక్షన్ ప్లాన్లు చేశారు.. అందులో బాగమే ఈ కుట్ర.. బీజేపీ నాయకులు శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
– దాడికి 15 నిమిషాల ముందే పోలీస్ వాళ్ళు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్లారు.. వాళ్ళ తనిఖీ ల సందర్భంగా ఎలాంటి ప్రచార సామగ్రి లేదు.
– టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు సంయమనం పాటించి ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయి ఉండాలి.
– చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది