చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ నవంబర్ 6న…
చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ క్రింద 10 వేలు చొప్పున వడ్డీ లేని రుణాలు. ఈ పథకాన్ని నవంబర్ 6వ తేదీన ప్రారంభించనున్న సీఎం జగన్ గారు.
ఇప్పటివరకు 8.9 లక్షల మంది చిరు వ్యాపారులను వడ్డీ లేని రుణాల కోసం లబ్ధిదారులుగా గుర్తించగా, వీరిలో 7 లక్షల మంది దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించారు. 4.3 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.10,000 చొప్పున బ్యాంకులు వడ్డీ లేని రుణంగా 431 కోట్లు మంజూరు.
వీళ్లందరూ అర్హులే..
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని ఉండాలి. రోడ్డు పక్కన, పుట్‌పాత్‌ల పైన, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారు, తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారూ అర్హులే. సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారు.
చిరు వ్యాపారి వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు కలిగి ఉండాలి. ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్ లేని వారికి కొత్తగా పొదుపు అకౌంట్ ప్రారంభించేలా వలంటీర్లే తోడ్పాటు అందిస్తారు.