సిద్దిపేట స్వర్ణ ప్యాలస్ లాడ్జ్ లో జరిగిన ఘర్షణపై దూది శ్రీకాంత్ రెడ్డి వివరణ…


సిద్దిపేట స్వర్ణ ప్యాలస్ లాడ్జ్ లో జరిగిన ఘర్షణపై బి.జే.పి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు స్థానిక కౌన్సిలర్ దూది శ్రీకాంత్ రెడ్డి మీడియా ముందు ఇచ్చిన వివరణ, పలు ప్రశ్నలు*
*మాపై దాడి చేసి మేము వాళ్ళపై దాడి చేసామని చిత్రీకరిస్తున్నారు టి.ఆర్.ఎస్ నాయకులు*
*లాడ్జ్ లో సి.సి ఫుటేజి తీయండి ఎవరు దాడి చేసారో తెలుస్తుంది..*
*తెల్లారితే ఎన్నికలు పెట్టుకుని ఎన్నికల కోడ్ అమలులో వున్నంక ఆంధోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేషంకి సిద్దిపేట లాడ్జ్ లో వుండాల్సిన అవసరం ఏముంది..?*
*సిద్దిపేట నుండి ఆంధోల్ తిప్పికొడుతే 50కిలో మీటర్లు వుండదు అలాంటిది సిద్దిపేట లాడ్జ్ లో వుండవలసిన అవసరమేముంది…?*
*ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ టి.ఆర్.ఎస్ నాయకులకు డబ్బులు అందించేందుకే లాడ్జ్ లో వున్నారు.*
*ఎవరు తాగింది తెల్వడానికి నేను మీరు వెల్లి పరీక్ష చేసుకుందాం.. నేను తాగినట్టు తేలితే దేనికైన సిద్దమే, మీరు తాగినట్టు తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడానికి సిద్దమా..? అంటు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కి సవాల్.*
తెల్లారితే దుబ్బాకలో జరగనున్న ఎన్నికల సంధర్బంగ స్వర్ణ ప్యాలెస్ వేదికగా టి.ఆర్.ఎస్ పార్టీ డబ్బు పంచుతుందనే సమాచారంతో స్వర్ణ ప్యాలెస్ కు వెల్లాము.
అది కూడ అక్కడకి వెల్లి తనిఖీ చేయలేదు, ఆ ప్యాలస్ లోనే రూమ్ తీసుకుని వుంటే గమనించొచ్చు అని యాజమాన్యాన్ని రూమ్ అడిగుతే ఖాళీ లేవని చెప్పడంతో అనుమానంతో రూములు చూయించండని చూస్తున్నాము.
ఈ క్రమంలో కావాలనే కుట్రతో టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మా దగ్గరకు వచ్చి రండిరా మమ్మల్నే చెక్ చేస్తరా అంటు చేయిపట్టి లాగుతూ వాగ్వాదానికి దిగారు.
దౌర్జన్యంగా వీధి రౌడి లాగా దాడి చేసి వారి మనుషులతో పిడి గుద్దులు గుద్దించారు.
అద్దంతో చేతి వేలు తెంపుకుని ఇప్పుడు బిజేపి కార్యకర్తలే దాడి చేసారని దుష్ప్రచారం చేస్తున్నారు.
లాడ్జ్ లో వున్న సి.సి కెమెరాల ఫుటేజిని చూస్తే ఏది నిజమో తెలుస్తుంది.
పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అస్సలు విషయం తెలుస్తుంది కాని వాస్తవాన్ని తెలుసుకోకుండ అధికార పార్టీ చెప్పిందని మాపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరం.
*# దూది శ్రీకాంత్ రెడ్డి (సిద్దిపేట జిల్లా బిజేపి అధ్యక్షుడు, స్ధానిక కౌన్సిలర్.*)

About The Author