క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పేవారు ఒకసారి ఈ పోస్టు చదవండి….

క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అది మా దేవుడి వల్లే వచ్చింది అని చెప్పేవారు ఒకసారి ఈ పోస్టు చదవండి….

ప్రస్తుతం ప్రపంచమంతా క్రీస్తు పూర్వం,క్రీస్తు శకం అంటూ కాలమానాల్ని లెక్కించటంపై హిందువులు చాలామంది అపోహలకి గురవుతున్నారు.మరి హిందువుల చరిత్ర అత్యంత ప్రాచీనమైనది అయితే క్రీస్తు శకాన్ని పట్టి కాలాన్ని లెక్కించటం ఎందుకొచ్చింది అన్నది అనేక మంది సందేహం.
ప్రపంచమంతా కూడా ఈ క్రీస్తు శకాన్ని వాడటంలో ఏమైనా ప్రముఖ విషయం ఉందా?
ఈ క్రీస్తు శకాన్ని విదేశీయులతో పాటు మనదేశానికి సంభందించిన అనేకమంది నాస్తికవాదులు కూడా చాలా గొప్పగా చూస్తారు.
ఇంతకీ ఈ క్రీస్తుశకమనేది ఎందుకొచ్చింది,దానివెనుక దాగిఉన్న యధార్ధమేంటి?
చరిత్రలో ఎపుడు ఏ సంఘటన జరిగిందో అని తెల్సుకోటానికి సంవత్సరాలను వరుసగా లెక్కించుకురావటం అవసరమైనది.అయితే ఈ లెక్కలు ఎక్కడనుండి మొదలైనది అని చెప్పటం మాత్రం కొంత కష్టమే.పురాణపురుషుల కాలం నుండో,మాహా ప్రతిభావంతులైన చక్రవర్తులకాలం నుండో,ప్రవక్తల కాలం నుంచో,ఏదైనా గొప్ప సంఘటన జరిగిన నాటి నుంచో సంవత్సరాలను లెక్కించటం చరిత్రలో ఒక రివాజు.దీనినే శకం లెక్కింపు అంటారు.
ఒక్కో జాతి ఒక్కో కాలంలో తమ శకాలను ప్రారంభించుకుంది.మన హిందూ జాతికి పురాతన కాలం నుండి అనేక శకాలున్నాయి
కలి శకం,విక్రమ శకం,శాలివాహన శకం మొ!! ఉన్నాయి.ప్రస్తుతం కలిశకం లెక్క ఆచరణలో ఉంది.ఆంగ్లేయుల పరిపాలనకాలంలో అలవాటుచేయబడిన కాలమానాన్ని నేటికీ మనం అనుసరిస్తున్నాం.
నేడు ప్రపంచంలో క్రైస్తవాన్ని ఆధరించే దేశాల ప్రాభల్యంతో ఏసు క్రీస్తు శకాన్ని ఉమ్మడి శకంగా తీస్కోవాలసి వచ్చింది అంతేకానీ శకాలకంటే క్రీస్తు శకానికి ఏ ప్రాధాన్యతా లేదు.
క్రీస్తు శకమనే కాలమానం ప్రపంచవ్యాప్తం కాకముందు వివిధ దేశాల్లో అనేక రకాల కాలమానాలు,శకాలు వాడబడేవి.అయితే కాలమానం కోసం శకాలను వాడింది మాత్రం ఈ ప్రపంచంలో హిందువులు మాత్రమే.
శకం అనే లెక్కను మననుండి నేర్చుకున్న విదేశీయులు క్రీస్తు శకమనే అసంభద్ద శకాన్ని సృష్టించారు అంతేకాదు తిరిగి దాన్ని మనకే అంటగట్టారు.
భారతదేశంలో ఒకపుడు పంచాంగం మాత్రమే అమలులో ఉండేది,ఆంగ్లేయుల పరిపాలన కాలంగా క్యాలెండే అనేటటువంటిది ఈ దేశంలో కూడా విస్తృతంగా ప్రచారంలో ఉన్నది..
వివిధ దేశాల ప్రజలు వివిధ కాలమానాలతో జీవనాలు సాగించేవారు,ఎవరి లెక్కలు వారికి ఉండేవి.తమకు తెలియని విషయాన్ని మరో జాతి నుండి నేర్చుకునేవారు.అయితే కాలం గడిచే కొలదీ ప్రపంచమంతా ఒకే కాలమాన పద్దతిని అనుసరిస్తే బావుంటుందనే భావన మొదలైంది.అయితే ఎవరి కాలమానాన్ని ఈ ప్రపంచ కాలమానంగా తీస్కోవాలి అన్న సమస్య వచ్చింది,ఈ సమస్య వచ్చిన కాలంలో ప్రపంచంలో అనేక ప్రాంతాలు,దేశాలూ బ్రిటీష్ వారి ఆక్రమణలో ఉన్నాయి,దీంతో బ్రిటీష్ వారు తాము స్వీకరించిన క్రీస్తు శకం అనే కాలమానాన్ని బలాతిశయంతో ప్రముఖంగా ముందుకు తీసుకువచ్చారు.తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాల్లో అమలు పెట్టటం మొదలు పెట్టారు..
ఈ విధంగా అనేక దేశాల్లో క్రీస్తు శకం వాడకం మొదలైంది.ఆ తరువాత మిగిలిన దేశాలు కూడా తమ సౌలబ్యం కోసం క్రీస్తు శక కాలమానాన్ని తప్పనిసరిగా తీసుకోవలసి వచ్చినది.
అయితే క్రీస్తు శకంలో ఒక తిరకాసు ఉంది.ఏసు క్రీస్తు ఎపుడు పుట్టాడు అనేది చరిత్రకారులు ఎవరు కూడా ఒక నిర్ధారణగా ఇప్పటకీ చెప్పలేకపోతున్నారు..
క్రీస్తు జీవితానికి సంభందించి ఏ చారిత్రక ఆధారమూ కనిపించటం లేదని విదేశీ చరిత్రకారులు తెలిపారు.
✓ప్రముఖ చరిత్రకారుడు హెచ్.జెవెల్స్ తన ప్రపంచ చరిత్ర గ్రంధంలో క్రీస్తు జీవితానికి సంభందించి ఆధారాలు లభించటం లేదని తెలిపారు.
✓బైబిల్ కూడా క్రీస్తు అనంతరమే రాయబడింది
✓క్రీస్తు పుట్టుక నుండే క్రీస్తు శకం మొదలైనది అని భావిస్తారు అనుకుంటే ఏసుక్రీస్తు జీవించటానికి చెప్పబడుతున్న కాలానికి కొన్ని శతాబ్ధాల తర్వాత క్రీ.శ 532 వ సం.లో డయోనీషియన్ ఎక్సిగీసస్ అనే రోమన్ సన్యాసి క్రీస్తు పేరుతో ఒక శకాన్ని ప్రారంభించాలని ప్రచారం మొదలు పెట్టాడట
✓క్రీస్తు పుట్టిన సంవత్సరం,క్రీస్తు శకం ఒకటే అని ఆయన ప్రతిపాదించాడు
✓అయితే చాలా కాలం వరకూ ఈ క్రీస్తు శకం అనే అంశాన్ని ఎవరూ అంగీకరించలేదు.
✓క్రీ.శ 816 లో చల్సా బిషప్ ల మహాసభ క్రీస్తు శకాన్ని వాడుకలోనికి తీసుకురావలంటూ పిలుపునిచ్చింది.అయినా కూడా దీన్ని ఎవరూ పట్టించుకోలేదు
✓ క్రీ.శ 879 సం.లో జర్మనీ చక్రవర్తి 2 వ చార్లెస్ మొట్టమొదటి సారిగా క్రీస్తు శకాన్ని అమలులో పెట్టటం జరిగింది
✓అనంతరం కాలక్రమంలో ఇతర చోట్ల మెల్ల మెల్లగా క్రీస్తు శకం వాడకం ప్రారంభమవటం జరిగింది.ఇది క్రీస్తు శకం అసలు చరిత్ర.
✓అంటే క్రీస్తు జీవితానంతరం 800 సం.ల తర్వాత క్రీస్తు శకం అమలులోకి వచ్చిందన్నమాట
✓అయితే క్రీస్తు పుట్టినది క్రీ.శకం ఒకటిలో కాదని క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ధంలో అని సుప్రసిద్ద చరిత్రకారుడు సర్ జాన్ కెప్లెర్ తేల్చాడని కొంతమంది చెప్తారు
✓అయినా కూడా క్రీ.శ లెక్కని మాత్రం ఎవరూ మార్చలేదు అలాగే వదిలేశారు ఆ తర్వాత ఇది అలాగే కొనసాగుతోంది
✓అమెరికా చరిత్రకారుడు విల్ డ్యూరాంట్ క్రీస్తు గత చరిత్రపై పరిశోధన చేశాడు
✓అంతేకాక డిసెంబర్ 25 న క్రిస్మస్ పండుగపై కూడా ఆయన ఆసక్తికరమైన విషయాలని బయట పెట్టాడు
✓క్రీస్తు పుట్టిన సంవత్సరాన్నే చరిత్రకారులు బయట పెట్టలేకపోయారు
✓మరి ఆయన పుట్టిన నెలా,తేదీలను నిర్ణయించే అవకాశాలు చరిత్రలో ఎక్కడా కనిపించలేదని దీనితో ఆ కాలాన రోం నగరంలో ప్రతి యేటా డిసెంబర్ 25 న శాటర్నేలియా అనే పండుగ వేలాదిమందితో తిరునాళ్ళ వలే జరుపుకునేవారు
✓ఇది క్రైస్తవ మత ప్రచారానికి అనుకూలంగా ఉంటుందని భావించిన ఎక్సీగస్ ఇదే రోజును క్రీస్తు జన్మదినంగా ప్రచారం చేసేవాడట
✓కాలక్రమేణా ఆ ప్రచారం ముదిరి క్రీస్తు శకం 1020 నాటికి డిసెంబర్ 25 వ తేది న ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు జన్మదినంగా అనేక చోట్ల స్తిరపడుతూ ప్రపంచంతా వ్యాప్తి చెందింది.
కొసమెరుపు: చరిత్ర నిర్ధారణ చేసినటువంటి మహా పురుషల కాలమానాన్ని ఆధారంగా తీస్కోవటం ఆనవాయితి. మరి అలాంటిది ఎపుడు పుట్టాడో కూడా తెలియని క్రీస్తు పుట్టుకని ఏ ప్రమాణంగా తీసుకుని ఈ క్రీ.శకం,క్రీ.పూర్వం అనేది ఎలా ఆధారంగా తీస్కున్నారో చరిత్రకారులకీ మరియూ దాన్ని గుడ్డిగా నమ్మేవాళ్ళకే తెలియాలి…

హైందవ సంస్కృతి అంటే మతం కాదు హైందవ ధర్మం..

About The Author