నాగార్జునసాగర్ లో బుద్ధవనం ఏర్పాట్లకు శ్రీకారం…


తెలంగాణరాష్ట్రం, నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత బుద్దవనం ప్రాజెక్టు పై సంబంధిత అధికారులతో హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ గారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జున‌ సాగ‌ర్ బుద్ధ‌వ‌నం ప్రాజెక్టును త్వ‌ర‌లోనే పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. నాగార్జునకొండ‌, బుద్ధ‌వ‌నం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్రాజెక్టు కోసం రూ.25 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు చెప్పారు. చారిత్ర‌క వ‌స్తువుల‌తో మ్యూజియం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చారిత్రక, వారసత్వ ప్రదేశాల పై పాలకులు నిర్లక్ష్యం చేసారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న చారిత్రక , వారసత్వ ప్రదేశాలను గుర్తించి అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ కు చెందిన వైతాళికులు, చరిత్రకారులు, కవులు , సాహితి వేత్తలు, మేదావులను గుర్తించి వారి చేసిన సేవలను బావితరానికి అందించాలనే సంకల్పంతో వారి జయంతి, వర్థంతి లను, వారి తిరిగాడిన ప్రాంతాల అభివృద్దికి అనేక ప్రణాళికలను రూపోందిస్తున్నామని అన్నారు.

బుద్దిస్టు చారిత్రక ప్రదేశాలైన ఫణిగిరి, ధూళికట్ట , బుద్దవనం మోదలైన ప్రాంతాల అభివృద్దికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి కెసిఅర్ గారు నిధులు కేటాయించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో దోరికిన చారిత్రక అవశేషాలతో పాటు పణిగిరి, నాగార్జున సాగర్ లో దొరికిన చారిత్రక అవశేషాలను, చరిత్రక విగ్రహాలను అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. అవసరమైతే రాష్ట్రానికి చెందిన హెరిటేజ్ తెలంగాణ అధికారులను పంపి రాష్ట్రానికి చెందిన చారిత్రక అవశేషాలను తిరిగి రప్పించేందుకు కృషిచేస్తామన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో బుద్దవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫిసర్ శ్రీ.మల్లేపల్లి లక్ష్మయ్య గారు, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త కార్యదర్శి రమేష్ గారు, టూరిజం డైరెక్టర్ మనోహర్ గారు, తెలంగాణ ఆర్కియాలజీ శాఖ అధికారులు నారాయణ గారు, సుజాత గారు తదితరులు పాల్గొన్నారు.

About The Author