రాజధాని రోడ్లపై త్వరలో మళ్లీ చక్కర్లు కొట్టనున్న డబల్ డెక్కర్లు?


డబల్ డెక్కర్లపై ఓ ఔత్సాహికుడి ట్వీట్ కు స్పందించిన మునిసిపల్ శాఖా మంత్రి కేటీ రామారావు.

అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కు డబల్ డెక్కర్లో వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్న మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ రోడ్లపై సంచరించే డబల్ డెక్కర్ బస్సులను ఎందుకు నిలిపివేశారో అర్థంకాలేదంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.

డబల్ డెక్కర్లను మళ్లీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ ని కోరుతూ కేటీఆర్ ట్వీట్.

మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్.

డబల్ డెక్కర్లను రోడ్లపైకి మళ్లీ తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై టీఎస్ ఆర్టీసీ ఎండీతో మాట్లాడుతానంటూ కేటీఆర్ కు రిప్లై ఇచ్చిన పువ్వాడ అజయ్.

About The Author