ఇన్స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ ధర రూ.1000
కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోగా విడుదల కాబోతున్నది. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇండియాలోని సీరం ఇన్స్టిట్యూట్ తో కలిసి ఈ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నది. ఇప్పటికే ఇండియాలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నది. అనుకున్నట్టుగా అనుమతులు వస్తే ఈ ఏడాది చివర్లో వ్యాక్సిన్ ను తీసుకొచ్చే అవకాశం ఉన్నది. 2021 ఫిబ్రవరి లోపు హెల్త్ కేర్ సిబ్బందికి, వృద్దులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, 2021 ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇన్సిట్యూట్ సీఈవో ఆడర్ పూనావాలా పేర్కొన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ధర రూ.1000 వరకు ఉంటుందని, వెయ్యి రూపాయలకే రెండు డోసులు అందిస్తామని అన్నారు.2024 నాటికి దేశంలోని అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని పూనావాలా తెలిపారు.