తెలుగు రాష్ట్రాల పైన ఎక్కువ ప్రభావం.దూసుకొస్తున్న నివార్
నివార్ దూసుకొస్తోంది. 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏ నిమిషంలోనైనా దక్షిణ భారత దేశంపై ఉరిమిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా తమిళనాడుపై నివార్ ప్రభావం ఉంటుందని… ఆ సమయంలో పెద్ద ఎత్తున బీభత్సం ఉంటుందని అధికారలు అంచనా వస్తున్నారు.ఇక.. తమిళనాడు తర్వాత తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్రాలోని నెల్లూరు, రాయలసీమలోని.. చిత్తూరు తదితర ప్రాంతాల్లో ఉంటుందని ఐఎండీ తెలిపింది. బుధవారం సాయంత్రం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.తీరం వెంబడి ఉన్న జిల్లాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
26 నుంచి తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది.
కడలూర్, విల్లుపురం, పుదుచ్చేరి ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడు తీరప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా.. తమిళనాడులో 2 కోస్ట్‌గార్డ్ నౌకలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.