మొబైల్ వాహనాల లబ్ధిదారులు ఎంపికకై ముఖా ముఖి…


* 37 పోస్టులు
* 138 దరఖాస్తులు
* 130 మంది హాజరు
* మినీ ట్రక్కులకు లబ్ధిదారులు ఎంపిక
* తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష

మినీ ట్రక్కు లకు పంపిణీ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి నగరపాలక సంస్థ లలిత కళా ప్రాంగణం నందు కమిషనర్ గిరీష ఆదేశాల మేరకు నగరపాలక అధికారులు, బ్యాంకు అధికారులు మరియు ఆర్టీవో అధికారులతో మినీ ట్రక్కుల కు లబ్ధిదారులకు ఎంపిక ఫై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

కమిషనర్ గిరీష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే సరుకులు అందించే దిశగా ప్రభుత్వం వారు చేపట్టారు, జనవరి ఒకటో తేదీ నుంచి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసే దానికి నేడు మొబైల్ వాహనాల లబ్ధిదారులు ఎంపిక పై (ఇంటర్వ్యూ) ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని 37 పోస్టులకుగాను 138 దరఖాస్తులు రావడం జరిగిందని అందులో 130 మంది హాజరైన వారిని వారికి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని, అందులో 37 మందిని ఎంపిక చేసి జనవరి ఒకటో తేదీ నుండి వార్డు వాలంటీర్ ద్వారా ఇంటి వద్దకే నిత్యవసర వస్తువులు, రేషన్ సరుకులు అందజేస్తారని, గతంలో ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు రేషన్ షాపు చుట్టూ తిరగడం, సర్వర్ పని చేయడం లేదని రేపు రా అంటున్నారని, ఇకమీదట రేషన్ కష్టాలు పడవలసిన అవసరం లేదని ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితోపాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, నగరపాలక అధికారులు రామచంద్ర రావు, జ్ఞాన సుందర్, పెద్దిరెడ్డి, బ్యాంక్ అధికారులు, ఆర్టీవో అధికారులు, సచివాలయ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

About The Author