PTC జాతీయ రహదారిపై అక్రమానలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు…
N.H 65 లింగంపల్లి నుండి సంగారెడ్డి వరకు ఉన్న జాతీయ రహదారి కబ్జాల పర్వం వాస్తవమా కాదా??
జిహెచ్ఎంసి అధికారులు ఈ రోజే నిద్రలో నుండి లేచారా జిహెచ్ఎంసి అధికారుల అలసత్వమే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కి స్థానిక పాత్రికేయులకు వివాదాన్ని ఏర్పరచిం దా పటాన్ చేరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాల విషయంలో సంతోష్ నాయక్ వరుస కథనాలను రాయడం వలన ఎమ్మెల్యే సదరు రిపోర్టర్ పై దుర్భాషలాడిన విషయం దేశమంతా తెలిసిందే
ఈ విషయంలో సంతోష్ నాయక్ రాసిన కథనాలు తప్పని చట్టబద్ధంగా పట్టా భూముల్లోనే దుకాణ సముదాయాలు ఉన్నాయని ఎమ్మెల్యే అనుచరగణం ప్రెస్మీట్లు పెట్టి గొంతు చించుకున్నా జిహెచ్ఎంసి అధికారులు సంతోష్ నాయక్ రాసిన కథనానికి స్పందించి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ దుకాణ సముదాయాలను కూల్చి వేస్తున్నారు
మొదటిలోనే ఈ కూల్చివేతలు చేపడితే ఎమ్మెల్యేకు విలేకరులకు ఇంతటి వివాదం జరిగేది కాదు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అన్యాయానికి కొమ్ముకాస్తు అక్రమార్జనకు దారులు తెరుస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నిస్తే ఎంతటివారికైనా చట్టపరమైన శిక్షలు తప్పవని ఈ సంఘటన తెలియజేస్తుంది….
ఇప్పుడైనా అధికారులు నాయకులకు కొమ్ము కాయ కుండా ప్రలోభాలకు లొంగకుండా సక్రమంగా విధులు నిర్వహించకపోతే మీడియా కన్ను గమనిస్తూ ఉంటుందని తెలుసుకోవాలి.
రిపోర్టార్, కిట్టు, పఠాన్ చేరు.
మెదక్, సంగారెడ్డి జిల్లా, పటాన్ చేరు నియోజకవర్గం.