అమరావతి..ఏం పాపం చేసింది..!?


ఒక అద్భుతానికి శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ!
నిర్మించబోయే ఆ భవంతులను తలుచుకుని ప్రతి భారతీయుడు సంతోషంగా గర్వంగా పులకించవచ్చు.
మోదీ గారు తమ అమృత హస్తాలతో ..ఇప్పటికే ఢిల్లీని తలదన్నే రాజధాని అమరావతి నగరానికి శంఖుస్దాపన చేసారు.
అయోధ్య రామాలయానికి భూమిపూజ చేసారు.
కొత్త గా నిర్మించబోయే వాటి నమూనాలు ఎంత గొప్పగా ఉన్నాయో..దేశ విదేశాల నిపుణులు రూపకల్పన చేసారు.
దేశప్రజలు..నాయకులు పోటీ పడి అభినందనలు తెలియచేసారు.
పాపం అమరావతి…. ! ఏమి పాపం చేసిందో!?
గ్రాఫిక్స్ అన్న దుష్ప్రచారంతో విలవిల లాడుతున్నది.
పగటికలగా మారింది.
ఒక అద్భుత ఆవిష్కరణ దుమ్ము కొట్టుకు పోయింది.
రంగుల చిత్రం వెలసి పోతున్నది.
భవిష్యత్తులో అజరామరంగా వెలుగొందవలసిన నగరం శిధిలాలయంగా కనిపిస్తుంది.
భూమి నిచ్చిన రైతుల నమ్మకం వంచనకు గురయింది.
ఆల్ ధింగ్స్ అండర్ ఒన్ రూఫ్!
ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టారు.
కులం కంపు వెదజల్లారు.
నిలువెల్లా ఈర్ష్యాద్వేషాలతో అట్టుడికిపోయారు.
కంటి ముందు ..పోలవరం నిర్మాణం చూసారు…కియా తనపని తాను చెయ్యటం చూసారు..శ్రీసిటీ ఉత్పత్తులు చూసారు.
అయినా భ్రమరావతి అంటే…
గ్రాఫిక్స్ అంటే..నమ్మారు.
డిజైన్లకి మన దేశంలో ఇంజినీర్లు లేరా అంటూ మొఖం చిట్లించారు.
ధర ఎక్కువ చెల్లించారని బుడిబుడి దుఃఖాలు తీసారు.
ఒక వ్యక్తి అసూయ..దాయాది ఈర్ష్య ..ఒక నేరగాడి అధికార దాహం..గమనించలేక పోయారు..
నమ్మారు…!
ఎక్కడికక్కడ ఛిద్రం చేసుకున్నారు .
అవివేకులు..కులోన్మాదులు ..పరాన్నజీవులకు….దుఃఖభాగులకు ..అభివృధ్ది అవసరం లేదు..అసలు వారికి అర్హత లేదు.
భవిష్యత్తు పట్ల బాధ్యత లేదు.
యస్! చంద్రబాబు ఏమి ఆలోచిస్తారో..
ఎంత తోపైనా అనుకరించి..ఆచరించి తీరాల్సిందే!
చేతగానోడు అయితే..పేరు మార్చో..రంగు మార్చో పనికానిస్తాడు.
ఒక పనివాడిని..ఒక దార్శనికుడిని..అభివృద్ధి కారకుడికి అవమానకరంగా విశ్రాంతి నిచ్చాము.
తిరిగి శపించని ఋషి కి తపోభంగం చేసాము.
మన సంపద మనం ధ్వంసం చేసుకున్నాము.
మన అభివృద్ధి ని మనమే అడ్డుకున్నాము.
మనకూట్లో మనమే మన్ను పోసుకున్నాము.
విభజిత ఆంధ్ర ఎదిగి పోతుందేమో అని కళ్ళల్లో నిప్పులు పోసుకున్న వారి మాటలు నమ్మారు.
మన నుదిటి రాతలు బ్రహ్మ వ్రాయలేదు..గుజరాత్ వాళ్ళు వ్రాస్తున్నారు.
వారికి కలమూ ..సిరా ఆంధ్ర ద్రోహులందిస్తున్నారు.

About The Author